మెడిసిన్స్ ఫ్రమ్ స్కై కార్యక్రమం ప్రారంభోత్సవానికి స్థల పరిశీలన చేసిన విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్ జిల్లా :- మెడిసిన్స్ ఫ్రమ్ స్కై కార్యక్రమాన్ని ప్రారంభించటానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాథిత్య సింధీయ గారు, రాష్ట్ర మునిసిపల్, ఐ టి పరిశ్రమల శాఖ మంత్రి కే టి ఆర్ గారు ఈ నెల 11 న వికారాబాద్ రానుండటంతో ఎస్ పి కార్యాలయ గ్రౌండ్ ను విద్యా శాఖా మంత్రి అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.

ఈ నెల 11 న వికారాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా డ్రోన్ ల సహాయం తో ప్రైమరీ హెల్త్ సెంటర్ లకు మందులు, వాక్సిన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు.

సభ స్థలి, డ్రోన్ లు ఎగిరే ప్రాంతం,మీడియా గ్యాలరీలను మంత్రి పరిశీలించి కలెక్టర్ కు పలు సూచనలు జారీ చేసారు.

అంతకుముందు అనంతగిరి రోడ్డులోని 100 పడకల ఆస్పత్రిని సందర్శించిన మంత్రి వర్యులు,ఆర్టిపిసిఆర్ సెంటర్ ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు .

దేశ వ్యాప్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుండటంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి వర్యులు సబితారెడ్డి అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో వికారాబాద్, తాండూర్, చేవెళ్ల శాసన సభ్యులు మెతుకు ఆనంద్, రోహిత్ రెడ్డి, కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ నిఖిల, SP నారాయణ తదితరులు పాల్గొన్నారు

Share This Post