“మెప్మా వరి ధాన్యం కొనుగోలు కేంద్రం”ను ప్రారంభించిన : జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్

పత్రికా ప్రకటన-2.   తేది:11.11.2021, వనపర్తి.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని, రైతుల అభివృద్ధి కొరకు అనేక పథకాలు చేపట్టడం జరిగిందని  జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ తెలిపారు.
గురువారం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ యార్డులో మెప్మా ఆధ్వర్యంలో వానకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఒక్క రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో “మెప్మా వరి ధాన్యం కొనుగోలు కేంద్రం”ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. వరి మద్దతు ధరను రూ.1960/- గా, కామన్ గ్రేడ్ ధర రూ.1940/- గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించడం జరిగిందని, అదే ప్రకారం వరి ధాన్యం సేకరణ చేయడం జరుగుతుందని ఆయన సూచించారు. రైతులు సకాలంలో వనపర్తి మార్కెట్ యార్డుకు ధాన్యం చేరే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి అనిల్ కుమార్, మెప్మా సిబ్బంది నాగరాజు, మార్కెట్ కమిటీ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
…………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post