ప్రచురణార్థం…..1
తేదీ.21.3.2023
మెరుగైన వైద్య సేవలు అందించాలి::జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
జయశంకర్ భూపాలపల్లి, మార్చి, 21:
–
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని, వైద్య సిబ్బంది చిత్త శుధ్దితో, నిబద్ధతతో అప్రమత్తంగా పనిచేయాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు.
మంగళవారం జిల్లా ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు , ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత, ప్రసవాల సంఖ్య , వైద్య పోస్టులు ఖాళీలు వాటి భర్తీ, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలు, హాజరు , సెలవు వివరాలు వంటి తదితర అంశాల పై కలెక్టర్ సంబంధిత అధికారులతో మెడికల్ సూపరింటెండెంట్ ఛాంబర్లో రివ్యూ నిర్వహించారు.
జిల్లాలోని ఆసుపత్రులలో వైద్యులు, వైద్య సిబ్బంది కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, మెరుగైన వసతులు అందించేందుకు అవసరమైన రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తున్నదని దానికి అనుగుణంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు సకాలంలో అందించాలని తెలిపారు
జిల్లా ఆస్పత్రిలో ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం ధోరణి కనిపించడానికి వీలు లేదని, వైద్యుల సకాలంలో అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని,విధులు సక్రమంగా నిర్వహించని వైద్యులు, సిబ్బందిని విధుల నుండి తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో డి.ఎం.హెచ్.ఓ.డా. శ్రీరామ్, మెడికల్ సూపరింటెండెంట్ డా. తిరుపతి, వైద్యులు , వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు…
జిల్లా పౌర సంబంధాల అధికారి , జయశంకర్ భూపాలపల్లి చే జారీ చేయనైనది…..