మేకలు, గొర్రెలలో వచ్చే నట్టల నివారణ వ్యాధి నిర్మూలన కోసం టీకా మందులను వేయించాలని బాల్రాజ్ యాదవ్ అన్నారు. బుధవారం నారాయణపేట మండలంలోని బోయినపల్లి గ్రామాల్లో మేకల, గొర్రెల నట్టల నివారణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాల్రాజ్ తెలంగాణా గొర్రెల మేకల అభిరుద్ది సహకార సమైక్య చైర్మన్ మాట్లాడుతూ మేకలు, గొర్రెలు పెంపకం చేసే కాపలదారులు తప్పకుం డా వాటికి వ్యాధి నిరోధక టీకాలను వేయించాలన్నారు. అదే విధంగా పశువులకు ఎలాంటి వ్యాధులు వ్యాపించిన వెంటనే పశువైద్య సిబ్బందిని సంప్రదించాల న్నారు. తెలంగాణా ప్రభుత్వం ముర్మ గొల్ల యాదవ్ లు ఆర్థికంగా అభిరుద్ది చెందాలనే ఉద్యేశ్యం తో గొర్రెల పంపిణి చేయడం జరుగుతోందన్నారు. మేకల, గొర్రెల పెంపకంతో రైతులు మరింత ఆర్థికాభివృద్ధి చెందుతార న్నారు. పశు పోషకులు తమ మేకలకు, గొర్రెలకు నట్టల నివారణ మందు వేయించాలని స్థానిక శాసన సభ్యులు యస్ రాజేందర్ రెడ్డి అన్నారు. నట్టల మందు పంపిణీ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ జిల్లా లో మొత్తం 1,25,784 మేక లు, గొర్రెలకు 12,98,279పంపిణి చేయడం జరిగిందన్నరు. సవత్సరం లో జీవాలకు ముడు సార్లు నట్టల నివారణ మందు వేస్తునట్లు తెలిపారు.