మేడారం జాతరలో పారిశుద్ధ్యాన్ని పరిశీలించిన గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

మేడారం ములుగు జిల్లా ఫిబ్రవరి 17

మేడారం గ్రామంలో జరుగుతున్న శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర లోని పలు వీధులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేసి జాతరలో పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా రోడ్లపై చెత్త వేయడానికి గమనించి సంబంధిత దుకాణదారులకు జరిమానా విధించారు. వీధులపై చెత్త చెదారం వేయరదని, పారిశుధ్యాన్ని పాటించాలని ఆయన కోరారు.

జాతరకు దాదాపు ఒక కోటి పైగా భక్తులు వస్తున్నందు వల్ల జాతరలో ఏ విధమైన అంటువ్యాధులు ప్రబలకుండా 24గంటలు జాతరలో పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను సిబ్బందిని ఆదేశించారు. జాతరలో దుమ్ము రేగకుండా ఎప్పటికప్పుడు వాటరింగ్ చేయాలని ఆయన కోరారు. అంటువ్యాధులు ప్రబలకుండా వీధులలో రెగ్యులర్ గా బ్లీచింగ్ పౌడర్ వేయాలని ఆయన కోరారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా చూడాలని ఆయన అధికారులను కోరారు.

Share This Post