ప్రచురణార్థం
ములుగు జిల్లా అక్టోబర్ 22( శుక్రవారం )
సమర్థవంతమైన పాలన లక్ష్యంగా రెండు జిల్లాల తాసిల్దార్ లు ఎంపీడీవోలు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు.
శుక్రవారం రోజున ములుగు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో భూపాలపల్లి, ములుగు తాసిల్దారు లు మండల అభివృద్ధి అధికారులతో కలిసి సమావేశమై పోడు భూముల సమస్యలపై పెండింగ్లో ఉన్న హైకోర్టు కేసులపై , ప్రతి తాసిల్దార్ ఆఫీస్, ఎంపీడీవో ఆఫీస్ లో రికార్డులు స్కానింగ్ చేసి కంప్యూటర్ లో భద్రపరిచే పరిచే విధానం, మేడారం జాతరలో భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా చేసే ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులకు హక్కు పత్రాలు అందించడం కొరకు గోల్డెన్ ఆపర్చునిటీ ప్రభుత్వం కల్పించిందని మీ దగ్గర ఉన్న పెండింగ్ లో ఉన్న సమస్యలను వారికి హక్కు పత్రాలు వచ్చే విధంగా సమస్యను పరిష్కరించాలన్నారు అలాగే తాసిల్దారు ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న హైకోర్టు కేసులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు , మండల అభివృద్ధి అధికారులు వారి కార్యాలయాల్లో ఉన్న ఫైల్స్ ను సక్రమంగా ఉంచుకోవాలని క్రమపద్ధతిలో ఆఫీస్ ఫైల్ మేనేజ్మెంట్ ద్వారా భద్రపరచాలి అన్నారు క్షేత్ర స్థాయి పర్యటనలో ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేస్తానని ఫైల్స్ క్రమ పద్ధతిలో లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామన్నారు మేడారం జాతర దగ్గర పడుతున్నందున భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించేందుకు ఒక కమిటీని ఫామ్ చేసి నివేదికలు తయారుచేసి చర్యలు చేపట్టాలన్నారు బాతింగ్ గాడ్స్ టాయిలెట్స్ వివిధ మౌలిక వసతులు పై చర్చించారు సాధ్యమైనంత తొందరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఆర్ డి ఓ శ్రీనివాస్ ములుగు ఆర్డీవో రమాదేవి, భూపాలపల్లి ముఖ్య ప్రణాళిక అధికారి శ్యాముల్ , ఎటునాగారం ఐటిడిఏ పిఓ జనరల్ వసంతరావు, సంబంధిత రెండు జిల్లాల తాసిల్దార్ లు మండల అభివృద్ధి అధికారులు ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.