మేడారం జాతర ఏర్పాట్లు ఘనంగా ఉండాలి* :జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

ప్రచురణార్థం
ములుగు జిల్లా
నవంబర్ 26 (శుక్రవారం)

జాతర ఏర్పాటు ఘనంగా ఉండాలి*
భక్తుల సౌకర్యార్ధం ప్రతి అధికారి సైనికుడిలా పనిచేయాలి
మేడారం జాతర ఏర్పాట్ల పై కలెక్టర్ సమీక్ష*

పనులు ప్రణాళిక బద్దంగా చేపట్టాలని: జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు

పిబ్రవరి 16 నుండి 19 వరకు జరిగే మేడారం మహా జాతర ఏర్పాట్ల ఘనం గా ఉండాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు.ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన సేక్టరియాల్ అధికారుల సమావేశం లో అయన మాట్లాడారు.కుంభ మేళాను తలపించే అతి పెద్ద గిరిజన జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు ప్రణాళిక బద్దంగా ఉండాలన్నారు.

గత జాతరను ద్రుష్టి లో ఉంచుకుని ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ అన్నారు. జాతర సెక్టోరియల్ అధికారులు,ఎలక్ట్రిసిటీ అధికారులు, పోలీసు శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతరలో డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, పార్కింగ్ ఏరియా , లోకేషన్స్ ఎక్కెడెక్కడ ఉన్నాయో టీం అధికారులకు అవగాహనా ఉండాలని అన్నారు. విధ్యత్ శాఖ అంశం పై అయన మాట్లాడుతూ జాతర ప్రాంగణంలో ఇప్పటి వరకు ఉన్న విధ్యుత్ స్తంబాలు వాటి నిర్వహణ తో పాటు ఇంకా ఏమైనా అదనంగా స్థంబాలు అవసరం ఉంటె ముందుగానే ఒక ప్రణాళిక వేసి నివేదికలు సమర్పించాలని ఈ స్సంధర్భంగా సంబందిత అధికారులను ఆదేశించారు.
భక్తుల రాకపోకలను ఉద్దేశించి అయన మాట్లాడుతూపోలీసు శాఖ సమన్వయంతో ముందుకు వెళ్ళడంతో పాటు పార్కింగ్ ఏరియాలు పట్టా భూమిలో ఉన్నాయా,ప్రభుత్వ భూమిలో ఉన్నాయా అనేదాని బట్టి పట్టా భూమి లో ఏర్పాటు చేసినట్లు ఐతే రైతులతో మాట్లాడి రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్ధం త్రాగు నీటి ఇక్కట్లు లేకుండా చూడటంతో పాటు సంబదిత ప్రాంతాల్లలో విధ్యుత్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలనీ అన్నారు. ప్రజల సౌకర్యార్ధం త్రాగు నీటిప్రాంతాల్లో, టాయిలెట్స్ ఉన్న చోట్ల లో లైట్స్ నిరతం వెలుగుతూ ఉండేలా చూడాలని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు.
ఈ సందర్భంగా ఏఎస్పి సాయి చైతన్య మాట్లాడుతూ గతంలో పార్కింగ్ ఏరియా లో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని వాటిని అధిగమించాలంటే ముందుగా ప్లాన్ చేసుకోవాలని అన్నారు. అలాగే పార్కింగ్ స్థలాలలో ఎలక్ట్రిక్ పోల్స్ ఒక పద్ధతిలో పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా పెట్టాలని అలాగే బ్యాటరీ ఆఫ్ టాప్స్ ను పార్కింగ్ కు అంతరాయం కలగకుండా నీరు నిలవకుండా ఏర్పాటు చేసుకోవాలని,పార్కింగ్ స్థలాల్లో చుట్టూ కందకం తవ్వినప్పుడు వచ్చిన మట్టిని అక్కడే వదిలేయకుండా ఎగ్జిట్, ఎంట్రీ ర్యాంపులు నిర్మించడానికి ఉపయోగించాలని సూచించారు. పార్కింగ్ స్థలాలలో లోపలి వరకు విద్యుత్ బల్బులను అమర్చి పార్కింగ్ స్థలం పూర్తిగా ప్రజలకు కనిపించే విధంగా ఏర్పాటు చేయాలన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఇలా గారు మాట్లాడుతూ పార్కింగ్ ఏరియా లో ఒక ఏరియాలో ఎన్ని వాహనాలు పార్కింగ్ చేయవచ్చో ముందేగానే ప్లాన్ చేస్తే బాగుంటుందని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా ఎలక్ట్రిసిటీ ఎస్.ఇ మల్చుర్ మాట్లాడుతూ గత జాతర ను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి ప్రాబ్లం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, 200 ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయుటకు ప్రతిపాదనలు పంపామని ,అలాగే ట్రాన్స్ఫర్ చుట్టూ కంచే ఏర్పాటు చేయిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రమాదేవి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, డి ఎల్ పి ఓ దేవరాజ్,తాడ్వాయి తాసిల్దార్ శ్రీనివాస్, ములుగు తాసిల్దార్ సత్యనారాయణ స్వామి, వెంకటాపురం తాసిల్దార్ నాగరాజ్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, కలెక్టరేట్ ఏవో శ్యామ్, కలెక్టరేట్ సూపర్డెంట్ రాజ్ ప్రకాష్,తదితరులు పాల్గొన్నారు.

Share This Post