మేడారం జాతర ఏర్పాట్లు

జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య గారు ఏటూరు నాగారం లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మేడారం లో డిసెంబర్ 1న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు మేడారం సందర్శించ నున్నారని వారి అద్యవర్యంలో మేడారం లో జరుగుతున్న అభివృద్ది పనులు పరిశీలించ నున్నారాని అన్నారు.

ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు,ఇరిగేషన్ అధికారులు,ఎలక్ట్రిసిటీ అధికారులు,పోలీసు అధికారులు,అర్ అండ్ బి,ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష జరిపి గత జాతర వీడియోలు,ఫోటో ల ఆధారంగా పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు.మేజర్ శాఖ వారీగా 13 కోట్ల కి సాoక్షన్స్ ఇచ్చాం. ఇందులో5.5.కోట్లు టెంపరరీ టాయిలెట్స్ కి,మిగతా డ్రింకింగ్ వాటర్, రవాణా సౌకర్యం నిమిత్తం రోడ్ల బాగుకు,తదితర వర్క్లకు సాంక్షన్ చేయడం జరిగిందని వారు అన్నారు. మేడారంలో మొత్తం 8 సెక్టార్స్, అందులో 8 మంది స్పెషల్ ఆఫీసర్స్ నియమించడం జరిగిందని,పస్ర నుండి మేడారం,కాల్వ పల్లి నుండి ఊరట్టం,మేడారం, నార్లపుర్ నుండి బాయక్క పెట్ వరకు రోడ్ల రిపేరుకు మంజూరు ఇవ్వనైనదని అన్నారు. మేడారంలో 1000 ఎకరాల్లో పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేయనుందని, రైతులతో మాట్లాడి వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడాలని అన్నారు.
8 సెక్టార్స్ 300 లొకేషన్ లో 6 వేల టాయిలెట్స్, 200 పెర్మనెంట్ టాయిలెట్స్ నిర్మాణ చెప్పట్టడం జరుగుతున్నది. 26 నూతన బోర్స్ ఏర్పాటు ,300 హ్యాండ్ బోర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. జాతర లో 395 డ్రింకింగ్ వాటర్ లోకేషన్స్ ఇవ్వడం జరిగిందని అన్నారు.

గత జాతర వీడియోలు,ఫొటోస్ ఆధారంగా పనులు నిర్వహిస్తున్నాం అని అన్నారు. భక్తుల సౌర్యార్ధం మౌఖిక వసతుల ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.

Share This Post