మేడారం జాతర ఏర్పాట్ల పనుల పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య.

వార్త ప్రచురణ.
ములుగు జిల్లా.
జనవరి 18,2022.(మంగళ వారం)

మేడారం మహా జాతరకు
భక్తుల రద్దీ పెరుగుతుండడంతో భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లను పరిశీలించుటకు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మంగళవారం రోజున మేడారం సందర్శించారు. ఈ సందర్శనలో రెవెన్యూ గెస్ట్ హౌస్, ట్రైబల్ వెల్ఫేర్ మ్యూజియం సందర్శన మరియు భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ పేర్లతో ఏర్పాటు చేసిన షేడ్స్ లో భక్తుల సౌకర్యాలను పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ గెస్ట్ హౌస్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఇ ఇ హేమలత ను ఆదేశించారు. అనంతరం జంపన్న వాగు లో ఏర్పాటుచేసిన స్నానఘట్టాల పనులు, డ్రెస్ చేంజ్ రూమ్స్ లను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. సీసీ రోడ్డు వైండింగ్ మరియు రెవెన్యూ గెస్ట్ హౌస్ పనుల పర్యవేక్షించారు.

కోవిడ్ ఉదృతి ఎక్కువగా ఉన్నందున భక్తులు మాస్క్ తప్పని సరి గా ఉండాలని కలెక్టర్ అన్నారు.

కొవిడ్ వ్యాక్సిన్ మొదటి మరియు రెండవ దశ వ్యాక్సిన్ తీసుకున్న వారు బూస్టర్ డోస్ తప్పనిసరిగా తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

జాతర పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు చేయించాలని , అమ్మవార్ల గుడి ప్రాంగణంలో పరి శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్వహణ లో ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూడాలని యంపిఓ ను ఆదేశించారు.

 

Share This Post