మేడారం జాతర టెలికాం సేవల పై సమీక్ష. జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య.

వార్త ప్రచురణ
ములుగు జిల్లా.
18-01-2022 మంగళవారం.

మేడారం జాతర ఏర్పాట్లలో వివిధ టెలికాం సంస్థల అధికారులతో మంగళ వారం రోజున జిల్లా కలెక్టర్ ఛాంబర్లో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశం లో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధ్యక్షతన టెలికాం సర్వీస్ నెట్ వర్క్ ఏర్పాట్ల పైన వివిధ ఫోన్ నెట్ వర్క్స్ 3G &4G సేవలు పై సమీక్ష సమావేశంలో నిర్వహించడం జరిగింది.

ఈ సమీక్ష సమావేశం లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మేడారం మహా జాతరకు కు వచ్చే జనాలకు మరియు తిరుగు వారం జాతర వరకు వచ్చే ప్రజల సౌకర్యార్థం టెలి కమ్యూనికేషన్ సేవలు అందించుటకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నెట్వర్క్ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా టెలి కమ్యూనికేషన్ సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రజల సౌకర్యార్థం ఉండాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.

అదేవిధంగా ప్రతి మండలంలో నెట్వర్క్ సేవలు ఉండేలా చూడాలని అన్నారు. ముఖ్యంగా కన్నాయిగూడెం మండలంలో మరియు అంకన్నగూడెం ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ లో చదువుకునే పిల్లలకు నెట్వర్క్ ఎక్కువ అవసరం అన్నారు. వారికి ఆన్లైన్ క్లాస్ ల నిమిత్తం నెట్ వర్క్ ఉండేలా చూడాలని కలెక్టర్ అన్నారు. ముఖ్యంగా వారు ఇతర ప్రాంతాల కంటే మెరుగు గా ఉండాలని కలెక్టర్ అన్నారు.

Share This Post