మేడారం జాతర పనులు జనవరి 15 వరకు పూర్తి చేయాలి : దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రా కరణ్ రెడ్డి

వార్త ప్రచురణ:
ములుగు జిల్లా
తేదీ 30.12.2021.

మేడారం జాతర పనులు జనవరి 15 వరకు పూర్తి చేయాలి : దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రా కరణ్ రెడ్డి

*గ‌తంలో కంటే మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు అధికారులు కృషి చేయాలి *స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

భక్తుల సౌకర్యార్థ. ఒక్క నెల ముందు నుండి జాతర ఏర్పాట్లు పూర్తి చేయాలి. స్థానిక శాసన సభ్యురాలు సీతక్క
మేడారం జాతర విజయవంతానికి అందరూ కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య
ఫిబ్రవరి 16 నుండి 19 వరకు జరిగే మహా మేడారం జాతర ను విజయవంతం చేయడానికి అందరు కృషి చెయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
గురువారం రోజున మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పనులు సమిక్షించుటకు విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ములుగు శాసన సభ్యురాలు దనసరి అనసూయా, జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్ గట్లు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య గార్లు అమ్మవార్లను దర్శించుకున్నారు. వారికీ పూజారులు సంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు. అనతరం అమ్మవార్ల కుంకుమ బంగారం ,పట్టు వస్త్రాలు అందిచారు.
అనతరం అటవీశాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్, శాశ్వత ప్రాతిపాదికన ట్రైబల్ వెల్ఫేర్ వారి నిధులతో నిర్మించిన అతిధి గృహాన్ని పరిశీలించారు. జంపన్న వాగులో పనులు, స్నాన గట్టాల నిర్మాణం ,బట్టలు మార్చుకునే గదులు, బ్యాటరి టాప్స్ ఏర్పాట్లను పరిశీలించి, వాటిని పనుల త్వరిత గతిన పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు .అనతరం మేడారం లో శాశ్వత ప్రాతిపదికన ఇంగ్లిష్ మీడియం స్కూల్ లో నిర్మించిన షెడ్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా హరిత హోటల్ లో సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనులపై క్షేత్ర స్థాయి అదికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడుతూ పిబ్రవరి 16 నుండి 19 వరకు జరుగు జాతరకు అదిక సంఖ్య లో భక్తుల వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జాతర సమీపిస్తున్న తరుణంలో శాశ్వత ప్రాతిపదికన నిర్మాణం చేస్తున్న అభివృద్ధి పనుల జనవరి 15 వరకు పనులు పూర్తి చేయడం సంతోషం అని వారు అన్నారు. తాగునీటి, పారిశుద్ధ్యం, వసతి, మరుగుదొడ్ల నిర్మాణం మరియు ఇతర సౌకర్యాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. సామాన్య భక్తుల క్యూ లైన్లు, భారీకేడ్లు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు . జాతరకు వచ్చే భక్తులకు తాగు నీటి ఇబ్బందులు లేకుండా చూడ డాలని, మరీ ముఖ్యంగా మహిళలు స్నానఘట్టాల వద్ద ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మేడారంలో రూ.10 కోట్లతో డార్మిటరీ, క్యాంటీన్, సూట్ రూమ్స్, ఇతరాత్ర సౌకర్యాలతో వసతి గృహాల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి నివేదిక సమర్పించాలని ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోన ప్రాభల్యం ఉన్న పరిస్టితుల దృశ్య భక్తులకు మాస్క్ లు మరియు మందులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు .
సమాచార శాఖ వారు ప్రచార సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా జాతర యొక్క ప్రాముక్యత ను ప్రపంచానికి చాటేలా ప్రచారం చేయాలని అన్నారు. మరియు మీడియా వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి పబ్లిసిటీ ఎక్కువగా వచ్చేలా చేయాలని ఆదేశించారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ జిల్లాలో అధికారులు బాగా పనిచేస్తున్నారని అభినందనలు తెలిపారు.
మేడారం జాతర ఏర్పాట్లు, నిర్వహణపై రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మేడారం జాతర పనులను ముమ్మరం చేయాలని,ప్రణాళిక బద్ధంగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని అన్నారు.గ‌తంలో కంటే మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. గతంలో వచ్చిన ఇబ్బందులను బేరీజు వేసుకుని, వాటిని ఈసారి అధిగమించేలా చూడాలని అన్నారు.తాగునీటి, పారిశుద్ధ్యం, వసతి, ఇతర సౌకర్యాలపై దృష్టి సారించాలని సూచించారు .సామాన్య భక్తుల క్యూ లైన్లు, భారీకెడ్లు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని , జాత‌ర‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు తాగు నీటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని, జంపన్న వాగు వద్ద ఏర్పాటు చేసిన స్నాన ఘ‌ట్టాల వ‌ద్ద త‌గిన ఏర్పాట్లు చేయాలని, సాంప్రదాయ బద్దంగా అమ్మవార్ల చిత్ర పటలను వేసి జాతర యొక్క విశిష్టతను చాటేల పెయింటింగ్ వెయిoచాలని ఆదేశించారు. మేడారం భక్తుల సౌకర్యార్ధం గ్రామపంచాయతీ పరిధిలో కమ్యూనిటీ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. జాతరలో పర్మినెంట్ టాయిలెట్స్ తో పాటు టెంపరరీ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని టాయిలెట్స్ వద్ద లైటింగ్ ఎక్కువగా ఉండేలా చేయాలని సంబంధిత శాఖల అధికారిని ఆదేశించారు. రహ‌దారుల కిరువైపుల ఆర్ అండ్ బీ అధికారులు సూచిక బోర్డుల‌ను ఏర్పాటు చేయాలని,భ‌క్తుల ర‌ధ్దీకి అనుగుణంగా ప్ర‌త్యేక క్యూ లైన్ల‌ను ఏర్పాటు చేయాలని ,పార్కింగ్ ఇబ్బందులు తలెత్త‌కుండా పోలీసులు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకొవాలని,పోలీసు ప్రత్యేక కంట్రోల్‌రూం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో జాతరను పర్యవేక్షించాలని మంత్రి గారు సూచించారు. జాతర అనంతరం చెత్త తొలగింపుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం తాగునీటి వసతికి చేతిపంపులు ఏర్పాటు చేయాలని అన్నారు. మేడారం జాతర పనులు సంక్రాంతి లోపు పూర్తి చేయాలని భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.జాతర అభివృద్ధి పనులకు 10 కోట్లు దేవదాయ శాఖ వారు ఇచ్చినందుకు సీతక్క మరియు మంత్రి సత్యవతి రాథోడ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ జాతరలో పోలీస్ శాఖ వారికి ఎక్కువ ఉంటుందని భక్తులకు ఇబ్బంది కలిగించకుండా నాయకులను గుర్తుపట్టే అనుభవం కలిగిన పోలీసు అధికారులను వీధులలో ఉంచాలని ఈ సందర్భంగా అన్నారు.

జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గత జాతర లో కెంటాయించినట్లు గా ఈ జాతరకు 75 కోట్లు కేటాయించి మంత్రి గారి చొరవతో బడ్జెట్ ముందుగా మంజూరు చేయడం జరిగిందని, జనవరి 15 వరకు అన్ని పనులు పూర్తి చేయుటకు అన్ని ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. జిల్లా కలెక్టర్ మేడారం జాతర పనుల కు అదనంగా పనులు చేపట్టుటకు 8.10 లక్షలను మంజూరు చేయాలని కోరారు. పిల్ల జాతరలకు బడ్జెట్ కేటాయిoచడం జరిగిందని , మేడారం జాతరకు వచ్చే భక్తులకు జవహర్ నగర్ వద్ద నేషనల్ హైవే ఏర్పాటు చేసిన టోల్ గేట్ ఫ్రీ అన్నారు. వివిధ శాఖల అధికారులు పనులు ఎ దశ లో ఉన్నాయో శాఖల వారిగా అడిగి తెలుసుకున్నారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జాతరలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అనుభవం కలిగిన అధికారులకు డ్యూటీలు ఇస్తున్నామని ఒక్క కామన్ కంట్రోల్ రూమ్ 380 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాతరలో హెలిప్యాడ్ ప్రవేట్ 1 ప్రభుత్వ పరంగా 2 మొత్తం మూడు హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, సి సి ఎఫ్ ఆశ, జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాటి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, ఎంపీపీ గొంది వాణిశ్రీ , ఐటిడిఎ ఎపిఓ వసంత రావు, తాడ్వాయి తాసిల్దార్ శ్రీనివాస్,ఇ.ఓ రాజేందర్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share This Post