మేడారం జాతర లో లైటింగ్ ఏర్పాట్లను పరిశీలనాకు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య

*మేడారం జాతర లో లైటింగ్ ఏర్పాట్లను పరిశీలనాకు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య*

మేడారం జాతర లో భక్తుల రద్దీ పెరుగుతున్నారు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత సెక్టరియల్ అధికారులను ఆదేశించారు.
మేడారం జాతర లో లైటింగ్ పనుల ను పరిశీలించి 24 గంటలు అమ్మవార్ల గుడి ప్రాంగణంలో నిత్యం వెలుగులు ఉండేలా చూడాలని ట్రాన్స్ కో అధికారుల ను ఆదేశించారు. మేడారం జాతరలో ఉరట్టం మోడల్ పార్కింగ్ ఏరియా ను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి మొదట పనులు పూర్తి చేసిన పార్కింగ్ ఏరియా ను జిల్లా కలెక్టర్ మంగళ వారం నాడు పరిశీలించారు. మిగతా పార్కింగ్ ఏరియా లను ఇదే మాదిరిగా ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఈ ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ హేమలత, తాడ్వాయి తాసిల్దార్ శ్రీనివాస్, మేడారం ఇ. ఓ రాజేందర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Share This Post