మేడారం మహా జాతర నిర్వహణపై ఆదివాసి పెద్దలు, ఆదివాసి సంఘాలతో సన్నాహక సమావేశం
మేడారం జాతర విజయవంతానికి అందరూ సహకరించాలి జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య
మేడారం మహా జాతర సమీపిస్తున్న తరుణంలో జాతర విజయవంతానికి ఆదివాసి పెద్దలు మరియు అదివాసి సంఘాలు సహకరించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు.
కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ఐ టి డి ఎ ఆధ్వర్యంలో ఆదివాసి పెద్దలు ఆదివాసి సంఘాలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ఇన్చార్జి పీవో ఎస్ కృష్ణ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మేడారం జాతరలో ఆదివాసి సంఘాలకు 22 లిక్కర్ షాపులు కేటాయించడం జరిగిందని అన్నారు. ఆదివాసీ సంఘాల మధ్య సమన్వయం ఉండాలని అన్ని సంఘాలు జాతర విజయవంతానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.
కార్యక్రమం ప్రారంభంలో ఆదివాసి సంఘం నాయకుల అభిప్రాయాలను వివరించాలని వారి అభిప్రాయాలను చట్టపరంగా అమలు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఆదివాసీ తుడుందెబ్బ నాయకులు మాట్లాడుతూ మద్యం బెల్లం కొబ్బరి కాయల షాపుల పర్మిషన్ ఒక వారం రోజులే కాకుండా రెండు వారాలు తిరుగు వారం వరకు పర్మిషన్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.
జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ జాతర నిర్వహణ ఆనవాయితీగా సాంప్రదాయంగా వస్తుంది అన్ని సంఘాల పెద్దలతో ఆదివాసి పెద్దలతో ఈ నెల 19వ తేదీన మేడారం ఆదివాసి మీటింగ్ హాల్ లో సమావేశం ఏర్పాటు చేస్తామని సూచించారు.
ఆదివాసి భవిష్యత్తు కోసం ఆదివాసి గిరిజన పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని చదువు వారి భవిష్యత్తు బాగుంటుందని వ్యాపారం చేసుకుంటారని ఆర్థిక అభివృద్ధికి ఐటీడీఏ ద్వారా రుణాలు మంజూరు చేస్తానని పూర్తిగా నేను బాధ్యత తీసుకుంటానని సందర్భంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాటి, డి ఆర్వో రమాదేవి, ఐటిడిఎ ఎపిఓ జె.వసంతరావు, డి టి ఓ మంకి డి ఎర్రయ్య, తాడువాయి తాసిల్దార్ శ్రీనివాస్ పెస జిల్లా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ ఆదివాసి తుడుందెబ్బ నాయకులు ఐటిడిఎ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.