మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనులు త్వరిత గతిన పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

వార్త ప్రచురణ
ములుగు జిల్లా (తాడ్వాయి మేడారం)
(జనవరి 4,మంగళ వారం)

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సమీక్ష
పనులు త్వరిత గతిన పూర్తి చేయాలి .
జాతర సమీపిస్తున్న సందర్భంగా పలు చోట్ల పర్యటించి మేడారం జాతర అభివృద్ధి పనులు ఈనెల15 వరకూ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ యస్. కృష్ణ ఆదిత్య అన్నారు.
మంగళవారం ఐటీడీఏ అతిథి గృహంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షి సమావేశం నిర్వహించారు. మేడారం జాతర అభివృద్ధి పనులపై పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ ఐటీడీఏ నిధులతో నూతనంగా నిర్మాణం చేసిన రెవెన్యూ అతిథి గృహం సందర్శించారు. తుది దశలో ఉన్న భవనం జనవరి పదిహేను వరకు పూర్తి చేయాలని ఇఇ హేమ లత ని ఆదేశించారు. ఆర్ డబ్ల్యు యస్ శాఖ ద్వారా నిర్మాణం చేస్తున్న వాటర్ టాంక్, అతిథి గృహం పనులు పరిసిలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్ డబ్ల్యు యస్ ఇఇ మాణిక్య రావు ని ఆదేశించారు. గెస్ట్ హౌస్ పనులు పరిసిలించారు. క్యూ లైన్ క్లియర్, పోలీస్ బ్యారికేట్ స్థలం,దేవాదాయ రూమ్ లు, వాచ్ టావర్ మరమ్మత్తులు చేయాలని, పూజారుల కోసం, విఐపిల కు అదనంగా మరో పది రూమ్ లు నిర్మించాలని ఐటీడీఏ ఇఇని ఆదేశించారు.దేవదాయ శాఖ డార్మెంటరీ హాల్ సుట్టూ పరారీ గోడ నిర్మించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు.వైద్యశాల మరియు మీడియా పాయింట్ పరిశీలించి ఏర్పాట్లు ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులని ఆదేశించారు.
పర్యటన అనంతరం జిల్లా కలెక్టర్ వివిధ జోనల్, సెక్టోరియల్ అధికారులతో సమీక్షా కార్యక్రమంలో కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ జాతర లో పాటు చేసిన 6 సెడ్లకు అమ్మవార్ల పేర్లు పెట్టాలని ఒక్కొక్క షేడ్ కి సమక్క ,సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు,జంపన్న పేర్లను పెట్టీ ప్రజలకు అర్థమయ్యే లా బోర్డు లు ఏర్పాటు చేయాలని, జిల్లా కలెక్టర్ ఐటిడిఎ ఈఈ హేమలత ను ఆదేశించారు.
జాతర విధులు నిర్వర్తించే అధికారులకు జోనల్, సెక్టోరియల్ అధికారులకు,అధికారులకు అకామిడేషన్ కల్పించుటకు ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ లో అన్ని ఏర్పాట్లు చేయాలని, అన్నారు. శానిటేషన్ వర్కర్లకు ఆకామడేషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఇంజనీరింగ్ పనులకి టెండర్స్ పూర్తి అయి పనులు ప్రారంభించకుండా ఏమైనా పనులు ఉన్నట్లు అయితే త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ అన్నారు.జాతర పనులు త్వరిత గతిన పూర్తి చేయడం తో పాటు నాణ్యత ప్రమాణాలు తప్పని సరి అన్నారు.జాతరకు వచ్చేపూజారులు కుటుంబాలకి కూడా అన్ని వసతులు కల్పించాలని అన్నారు. పార్కింగ్ ఏరియా లో రాంపు బాగుండాలని, డయాస్ బాగుండాలని, ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేలా చూడాలని, పార్కింగ్ లో లైటింగ్ ఎక్కువగా ఉండేలా చూడాలని అన్నారు. టెంపుల్ లో నిత్యం కాంతులు విరజిమ్మే లా లైటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. టెంపుల్ లో అండర్ గ్రౌండ్ ద్వారా ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. డ్రింకింగ్ వాటర్ కి ఎలాంటి కొరత లేకుండా చూడాలని ఓవర్ హెడ్ ట్యాంక్ లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అధికారులకు అకామిడేషన్ ఏర్పాటుకై స్కూల్ బిల్డింగ్స్,యూత్ బిల్డింగ్ లలో వసతి కి కావలసిన మరమ్మతుల కు ఏర్పాట్లు చేయాలని అన్నారు. 3 హెలిప్యాడ్ ఏర్పాట్లను రిపేరు చేఇంచుటకు ఇఇ ఆదేశించారు.
మేడారం జాతర ఏర్పాట్ల నిర్వహణకు జోన్లుగా 9 విభజించి 38 సెక్టార్లు గా పనులు నివహించుటకు ఒక్కొక్క తసిల్దర్స్ ఒక్కో జోన్ కేటాయించి పనులు పరిశీలించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. జోన్ల వారిగా మరుగుదోడ్ల నిర్మాణం ,బ్యాటరి టాప్,ఎలేక్ట్రిసిటి పోల్సు ఏర్పాటు, లైటింగ్, త్రాగునీటి ఏర్పాటు, పార్కింగ్ ఏరియాలలో అన్ని ఏర్పాటు చూడాలని జిల్లా కలెక్టర్ అన్నారు. పైలెట్ ప్రాజెక్ లా ఉరట్టo పార్కింగ్ స్థలం లోఅన్ని హంగులతో పార్కింగ్ ఏర్పాట్లు ఈ నెల 11 వరకు పూర్తి చేసినట్లు అయితే మిగతా పార్కింగ్ ఎరియాలలో ఎలా చేయాలనేది తెలుసుకునేల ఉంటుందని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులకు తగు సూచనలు చేసారు.
ఈ కార్యక్రమంలో ఎస్పి సంగ్రామ్ సింగ్ జి ,పాటిల్ అదనపు కలెక్టర్ ఇలా త్రిపాటి డి ఆర్ వో రమాదేవి ఐటీడీఏ ఎ పీవో వసంతరావు, అడిషనల్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కెన్ ఎస్ పి అశోక్ కుమార్ కలెక్టరేట్ ఈవో శ్యామ్ సూపర్డెంట్ రాజు ప్రకాష్ ఐ టి డి ఎ ఈ హేమలత ఆర్ డి ఎమ్ హెచ్ ఓ అప్పయ్య డబ్ల్యూ ఎస్ ఈ ఈ మాణిక్యరావు మేడారం ప్రధాన పూజారి జగ్గారావు ఈవో రాజేంద్ర తహశీల్దార్లు, ఎంపిడివోలు డి ఎల్ పి ఓ ఎం పి ఓ సంబంధిత శాఖల అధికారులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post