మేడ్చల్ జిల్లా, కొండాపూర్ గ్రామము లో కొత్త బాలికల ప్రభుత్వ ITIకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు రూ. 7 కోట్ల రూపాయలు విడుదల చేయు సందర్భంగా రాష్త్ర కార్మిక, ఉపాధి కల్పన మరియు నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ సిహెచ్. మల్లారెడ్డి సమక్షంలో ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ సంచాలకులు మరియు హెచ్.ఏ.ఎల్.సంస్థ జనరల్ మేనేజర్ అవగాహన ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు.

బాలికల ప్రభుత్వ ITI  కి ముఖ్యమంత్రి గారి అనుమతి

మన ప్రియతమ ముఖ్య మంత్రి శ్రీ కె. చంద్రశేఖర్  రావు గారు మేడ్చల్ జిల్లా, ఘటకేసర్ మండలము, కొండాపూర్ గ్రామము లోని సర్వే నెం. 119 లో  బాలికల వృత్తి శిక్షణ కొరకు  క్రొత్త  ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ITI) ను ప్రారంభించడానికి అనుమతి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.   బాలికలకు  ప్రత్యక  ITI అనుమతించి  ముఖ్య మంత్రి గారు  బాలికల వృత్తి శిక్షణ  కొరకు తన నిబధ్ధతను నిరూపించుకున్నారు.  బాలికలకు వృత్తి శిక్షణ అవసరము అని,  బాలికల ITI ని నెలకొలపుతున్నందుకు  అంతేగాక  నేను కార్మిక, ఉపాధి మరియు శిక్షణ మంత్రిగా ఉన్న నా అసెంబ్లీ నియోజక వర్గములో నెలకొలపుతున్నందుకు నా తరపున మరియు నా నియోజక వర్గ   బాలికలు మరియు మహిళల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను.

ఇట్టి బాలికల పారిశ్రామిక శిక్షణ సంస్థ కొరకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు వారి సి.ఎస్.ఆర్. నిధులనుండి రూ. 7 కోట్ల రూపాయలను విడుదల చేయుటకు సంసిద్ధత వ్యక్తపరిచిన దరిమిలా ఈ రోజు తెలంగాణ రాష్త్ర కార్మిక, ఉపాధి కల్పన, కర్మాగారములు మరియు నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ సిహెచ్. మల్లారెడ్డి గారి సమక్షంలో హెచ్.ఏ.ఎల్.సంస్థ తరుపున జనరల్ మేనేజర్  శ్రీ అరుణ్ జనార్దన్ సరకటే మరియు రాష్ట్ర ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ సంచాలకులు శ్రీ కె.వై.నాయక్, ఐ.ఏ.ఎస్. గారు అవగాహన ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు.

ఈ బాలికల పారిశ్రామిక శిక్షణ సంస్థలో ప్రతి సంవత్సరం 232 మంది బాలికలకు ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిజం, కోప, ఫాషన్ డిజైన్ మరియు టెక్నాలజీ, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మరియు డిజైన్ లపై శిక్షణ ఇవ్వడానికి కావలసిన అన్ని సౌకర్యములు కల్పించబడుతున్నట్లు తెలియచేసారు.

ఈ కార్యక్రములో హెచ్.ఏ.ఎల్. మేనేజింగ్ జనరల్ మేనేజర్ శ్రీ  అరుణ్ జనార్దన్ సరకటే, ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ సంచాలకులు శ్రీ కె.వై.నాయక్, ఐ.ఏ.ఎస్. గారు, శ్రీ నగేష్, సంయుక్త సంచాలకులు, మేనేజింగ్ డైరెక్టర్, TSEWIDC  శ్రీ జి. పార్థసారధి గారు, శ్రీ ఎం. అనిల్ కుమార్ గారు, చీఫ్ ఇంజనీర్ TSEWIDC , శ్రీ కె. కుమార్ గౌడ్, ఎక్సిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.

Share This Post