మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వార్షిక రుణప్రణాళిక సిద్దం, రూ.16,373 కోట్ల లక్ష్యంతో ఆర్థిక రుణ ప్రణాళిక విడుదల, జిల్లాలో పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తూ ప్రణాళిక తయారీ జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్,

మేడ్చల్మల్కాజిగిరి జిల్లా వార్షిక రుణప్రణాళిక సిద్దం,

రూ.16,373 కోట్ల లక్ష్యంతో ఆర్థిక రుణ ప్రణాళిక విడుదల,

జిల్లాలో పరిశ్రమలకు  ప్రాధాన్యతనిస్తూ ప్రణాళిక తయారీ

జిల్లా అదనపు కలెక్టర్​ శ్యాంసన్,

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాకు సంబంధించి 2022–2023 సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళికలో ప్రధానంగా పరిశ్రమలకు, ఎంఎస్​ఎమ్​ఈ రంగాలకు  ప్రాధాన్యతనిచ్చేలా ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్​ అన్నారు.

గురువారం జిల్లా కలెక్టరేట్​లోని సమావేశ మందిరంలో  జిల్లాలోని బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2022– -2023  సంవత్సరానికి సంబంధించి రూ.16,373 కోట్లతో జిల్లాకు చెందిన ఈ సంవత్సరానికి చెందిన వార్షిక రుణ ప్రణాళికను అదనపు కలెక్టర్​ విడుదల చేశారు. ఈ మేరకు గత సంవత్సరం  రూ14,411  కోట్లతో   జిల్లా రుణ ప్రణాళికను రూపొందించగా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రూ.14,736 కోట్లతో అనుకున్న లక్ష్యానికి 102 శాతం చేరుకొన్నామని ఈ సందర్భంగా వివరించారు.  దీంతో పాటు  ఈ యేడు దానిని మరింత ఎక్కువగా పెంచామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం రుణ ప్రణాళికలో పరిశ్రమలు,( ఎంఎస్​ఎమ్​ఈ) రంగాలకు రూ.4,865 కోట్లు,  వ్యవసాయ రుణాలకు సంబంధించి 1,588  కోట్లు, విద్యారంగానికి రూ.285 కోట్లు, హౌసింగ్​ రంగాలకు రూ. 898 కోట్లతో పాటు ప్రాధాన్యత రంగాలకు గాను రూ.7,909. 56 కోట్లతో రుణ ప్రణాళికను రూపొందించినట్లు అదనపు కలెక్టర్ శ్యాంసన్​ పేర్కొన్నారు. అలాగే బ్యాంకులకు వచ్చే రైతులకు, పారిశ్రామికవేత్తలకు  అర్హత ఉన్నప్పటికీ కొన్ని చోట్ల రుణాలు అందించడంలో ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వారికి అర్హత ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణాలు అందచేయాలని సూచించారు. రుణాలు అందించే విషయంలో బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించుకోవాలని దీనివల్ల లబ్ధిదారులకు వీలైనంత త్వరితగతిన అందచేసేందుకు అవకాశముంటుందని పేర్కొన్నారు.అర్హత కలిగిన లబ్ధిదారులకు రుణ సదుపాయం  అందించేలా ఆయా శాఖల జిల్లా అధికారులు,  బ్యాంకు అధికారులు  చొరవ తీసుకోవాలన్నారు. సర్వీస్ సెక్టార్ లో రుణాలు వేగవంతంగా ఇవ్వడంలో బ్యాంకర్లు చొరవ చూపాలని అన్నారు. అర్హులైన దరఖాస్తుదారుల వివరాలను ఎప్పటికప్పుడు లిస్టవుట్ చేసి ఫాలో అప్ చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు.. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాల మంజూరీలో ఏఏ బ్యాంకులు ఎంత వరకు రుణాలు మంజూరీ చేశారు, గ్రౌండింగ్కు సంబంధించిన వివరాలను ఆయా బ్యాంకుల వారీగా  అడిగి తెలుసుకొన్నారు. కరోనా కష్ట సమయంలో కూడా బ్యాంకర్లు జిల్లా అభివృద్ధికి పాల్పడ్డారని అదనపు కలెక్టర్ శ్యాంసన్​ వారి సేవలను కొనియాడారు. అనంతరం 2022–2023 సంవత్సరానికి సంబంధించిన జిల్లా వార్షిక రుణప్రణాళిక పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ పి.కిశోర్​కుమార్​, ఆర్ బి ఐ ఎల్ డి ఓ పూర్ణిమ, నాబార్డ్ డి డి ఎం ప్రవీణ్ కుమార్, , కెనరా బ్యాంక్ డి జి ఎం  అనంత్ , జడ్పీ సీఈవో దేవసహాయం  జిల్లా వ్యవసాయాధికారిణి మేరీ  రేఖ, ఇండిస్ట్రిస్ జి ఎం ,రవీందర్ , జిల్లా ఎస్సీ కార్పొరేషన్​ ఈడీ బాలాజీ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post