మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో టెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లతో సిద్దం టెట్ పరీక్షల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ హరీశ్

పత్రిక ప్రకటన

తేదీ : 07–06–2022

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో టెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లతో సిద్దం

టెట్ పరీక్షల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ హరీశ్

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 12వ తేదీన నిర్వహించనున్న టెట్ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈనెల 12న నిర్వహించనున్న టెట్ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై డీఈవో విజయకుమారితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ…  జూన్ 12వ తేదీన నిర్వహించనున్న టెట్ పరీక్షలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి పేపర్కు సంబంధించి 29 పరీక్ష కేంద్రాలను,  మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో పేపర్కు సంబంధించి 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.  ఉదయం జరిగే మొదటి పరీక్షకు  6,968 మంది, మధ్యాహ్నం జరిగే  రెండవ పేపర్‌కు 5,915 మంది హాజరవుతారని వివరించారు.  దీనికి సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు 72 మంది, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు 72 మంది, రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్వ్కాడ్ ఆఫీసర్లు 28 మంది, హాల్ సూపరిటెండెంట్లు165 మంది,  ఇన్విజిలేటర్లు 650 మందిని నియమించినట్లు పేర్కొన్నారు. అలాగే  పరీక్ష సమయం దాటి ఒక్క నిమిత్తం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరగదని కలెక్టర్ హరీశ్ సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ, రెవెన్యూ శాఖల సమన్వయంతో పేపర్లు భద్రపరిచే స్ర్రాంగ్ రూమ్ నిర్వహణ ఉంటుందని, పరీక్ష ముగిసే వరకు పూర్తి స్థాయి భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి  పేపర్లు పరీక్ష రోజున ఆయా రూట్ల ద్వారా కేంద్రాలకు చేరుకుంటాయని, పరీక్ష అధికారులు, రూట్ అధికారులు, ఫ్లయింగ్ స్వ్కాడ్బాధ్యతలు నిర్వహిస్తారని వివరించారు. పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచే విధంగా చూడాలని…  వేసవి ఉష్టోగ్రత కారణంగా అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని, పరీక్ష కేంద్రాలలో పారిశుద్ధ్య నిర్వహణ,  మంచినీరు, నిరంతర విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని, పరీక్ష సమయానికి కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ అధికారులు బస్సులను నడిపించేలా చర్యలు తీసుకోవాలని, పేపర్లు పరీక్ష కేంద్రాలకు తరలించేందుకు జిల్లా రవాణా శాఖ అధికారులు వాహనాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ హరీశ్  ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. తెలిపారు.

Share This Post