మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో పనులను మరింత వేగవంతం చేయాలి, జిల్లా అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశంలో కలెక్టర్ హరీశ్,

పత్రిక ప్రకటన

తేదీ : 05–11–2022

 

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో పనులను మరింత వేగవంతం చేయాలి,

జిల్లా అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశంలో కలెక్టర్ హరీశ్,

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అభివృద్ధి పనుల విషయంలో అధికారులు ప్రణాళికతో ఉంటూ అభివృద్ధిని వేగవంతం చేసేలా మరిన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు.

శనివారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాకు సంబంధించిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నియోజకవర్గ అభివృద్ధి నిధులతో పాటు ఎంపీ ల్యాడ్స్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్‌తో పాటు ఇతర అభివృద్ధి నిధులకు సంబంధించి పనులు తదితర అంశాలపై పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వాటర్ వర్స్క్, జీహెచ్ఎమ్సీ, ఇరిగేషన్ రూరల్, డీఆర్డీఏ, డీడబ్ల్యువో, జడ్పీ, మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ అధికారుతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఇప్పటి వరకు జిల్లాకు ఆయా పథకాలు, నిధుల కింద వచ్చిన వాటిపై సమగ్ర వివరాలను ఒక్కో శాఖ అధికారి నుంచి తెలుసుకొని వాటి పనుల పురోగతి ఏఏ స్థాయిలో ఉన్నాయనే వివరాలను అడిగి తెలుసుకొన్నారు. జిల్లాకు వచ్చిన నిధుల ద్వారా ఇప్పటి వరకు చేపట్టిన పనులు ఎంత వరకు వచ్చాయి ఇంకా ఏఏ స్థితిలో ఉన్నాయనే వివరాలను సంబంధిత శాఖల అధికారులు కలెక్టర్ హరీశ్‌కు వివరించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లాకు సంబంధించి ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని నిధులు కూడా ప్రభుత్వం అందచేస్తున్నందున ఈ విషయంలో ఏమాత్రం ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధి విషయంలో అధికారులు ఏమాత్రం అలసత్వం, నిర్లక్ష్యం వహించరాదని ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. అలాగే ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ఇంకా పూర్తి కానట్లయితే వెంటనే వేగవంతం చేసి ఆ పనులను పూర్తి చేయాలని సమీక్ష సమావేశంలో అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వచ్చే సమావేశానికల్లా అధికారులందరూ పూర్తి సమగ్ర సమాచారంతో అన్ని వివరాలతో సంసిద్దులై రావాలని  కలెక్టర్ హరీశ్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, సీపీవో మోహన్‌రావు,  జడ్పీ సీఈవో దేవసహాయం, జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి,  ఆర్ అండ్ బీ ఈఈ శ్రీనివాసమూర్తి,  పంచాయతీ రాజ్ ఈఈ రాంమోహన్‌రావు,  జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి పద్మజారాణి,  జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి, జిల్లా సంక్షేమాధికారిణి పావని, జిల్లా అటవీ శాఖ అధికారి జోజీ, జిల్లా వాటర్ వర్స్క్ అధికారి, జీహెచ్ఎమ్సీ అధికారి,   రూరల్ ఇరిగేషన్ అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు, ఆయా మండలాల ఎంపీడీవోలు,  పోలీసు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post