మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్గాఅభిషేక్ అగస్త్య,
అదనపు కలెక్టర్గాబాధ్యతలు స్వీకరించిన అభిషేక్ అగస్త్య,
మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా అభిషేక్ అగస్త్య( 2020 సివిల్స్ బ్యాచ్)నియామకయ్యారు. ఈ మేరకు బుధవారం ఆయన జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకొని తన ఛాంబర్లో అదనపు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అభిషేక్ అగస్త్యను మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా జిల్లా అదనపు కలెక్టర్గా ఇప్పటి వరకు విధులు నిర్వహించిన శ్యాంసన్ నుంచి అభిషేక్ అగస్త్య జిల్లా అదనపు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, జడ్పీ సీఈవో దేవసహాయం, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు ఉన్నారు. అనంతరం నూతనంగా అదనపు కలెక్టర్గా బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించిన అభిషేక్ అగస్త్యను జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు.