మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శన,

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శన,
స్వీప్ అవగాహన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి,
భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ముసాయిదా ఓటర్ జాబితాను జిల్లా కలెక్టర్ హరీశ్ సూచనల మేరకు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని అన్ని పోలింగ్ బూత్లలో  ప్రదర్శించడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం జిల్లాలోని దుండిగల్ మున్సిపల్ కౌన్సిల్ హాల్  వద్ద నిర్వహించిన స్వీప్ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన నర్సింహారెడ్డి మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ఈ నెల 9న ముసాయిదా ఓటర్ జాబితాను ప్రదర్శించాలని ఈ మేరకు మేరకు ఓటరు జాబితాను పోలింగ్ బూత్లలో  ప్రదర్శించడం జరిగిందని వివరించారు. దీనికి సంబంధించిన ఓటరు జాబితాను పరిశీలించి ఏమైనా మార్పులు, చేర్పులు తదితరాలు ఉన్నట్లయితే అభ్యంతరాలు తెలియజేసుకోవచ్చని నర్సింహారెడ్డి సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి తప్పులు లేకుండా స్పష్టంగా ఎలాంటి తప్పులు లేకుండా  ఉండేలా మంచి ఓటరు జాబితా తయారు చేయడానికి బూత్ స్థాయి అధికారులు అవసరమైన చర్యలు తీసుకొంటున్నారని ఈ విషయంలో ప్రజలు, ఓటర్లు  కూడా సహకరించాలని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి కోరారు. పాఠశాల, కళాశాల స్థాయిలో చదువుకొంటున్న అలాగే 18 సంవత్సరాలు ఉన్న  యువ ఓటర్లను గుర్తించడంతో పాటు భవిష్యత్తులో వచ్చే ఓటరు జాబితాలో నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.  మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వారి పరిధిలో ఓటరు ముసాయిదా జాబితాలను ప్రదర్శించడంతో పాటు చునావ్ పాఠశాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు.  జిల్లా వ్యాప్తంగా సవరించిన ఓటరు చివరి జాబితాను 2023 జనవరి 5వ తేదీన ప్రకటించడం జరుగుతుందని ఈ తుది జాబితానే అన్నీ ఎన్నికలకు ప్రామాణికంగా ఉంటుందని అన్నారు. అనంతరం పోలింగ్ బూత్లో  ప్రదర్శించిన ముసాయిదా  ఓటరు జాబితాను అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి, డీసీవో ఆర్. శ్రీనివాస మూర్తి,  తహశీల్దార్ పద్మప్రియ, మున్సిపల్ కమిషనర్ బోగేశ్వర్లు, డీఐవో కిషన్, మెప్మా జిల్లా కో–ఆర్డినేటర్ అనిల్, సీవో మంజుల, బూత్ లెవల్ అధికారులు, మెప్మా రీసోర్స్ పర్సన్లు, క్యాంపస్ అంబాసిడన్లు, మహిళా పొదుపు సంఘం సభ్యులు,  మహిళా రీసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు

Share This Post