కలెక్టర్కు స్వాగతం పలికిన అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు,
మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా కలెక్టర్గా అమోయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం శామీర్పేటలోని జిల్లా కలెక్టరేట్ ఆఫీసుకు చేరుకొని కలెక్టరేట్ ఛాంబర్లో బాధ్యతలను స్వీకరించారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఇంఛార్జి కలెక్టర్గా ఇప్పటి వరకు విధులు నిర్వహించిన హరీశ్ రంగారెడ్డి కలెక్టర్గా బదిలీ కాగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న అమోయ్ కుమార్ను మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులుజారీ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కలెక్టరేట్కు చేరుకున్న అమోయ్ కుమార్కు జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు పుష్పగుచ్చాలు అందచేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్లో అమోయ్ కుమార్ సంతకం చేసి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన కలెక్టర్గా వచ్చిన అమోయ్ కుమార్కు ఆయా శాఖల జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.