మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి అందించేందుకు అన్ని ఏర్పాట్లు,

పత్రిక ప్రకటన–1                                                    తేదీ : 24–11–2022
===========================================

వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి, సీఎస్‌లకు వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ హరీశ్,
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2023 జనవరి 15వ తేదీ నాటికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్  గృహాల నిర్మాణం పురోగతి, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై సమీక్షించారు.  ఈ సందర్భంగా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్  నుంచి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,350 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మంజూరు కాగా 881 ఇండ్లకు టెండర్లు పూర్తయ్యాయని అందులో 803 డబుల్ బెడ్రూమ్లు పూర్తి చేసి అన్ని సౌకర్యాలు కల్పించి అర్హులైన లబ్ధిదారులకు అందచేసినట్లు కలెక్టర్ హరీశ్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు ధరణి ప్రక్రియకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కొనసాగుతోందన్నారు. అలాగే 58 జీవోకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 38 వేల దరఖాస్తులు రాగా వాటిని పరిశీలిస్తున్నామని దీనికి సంబంధించి పూర్తి ప్రక్రియను డిసెంబరు 5వ తేదీ వరకు పూర్తి చేస్తామని ఈ విషయంలో జిల్లా స్థాయి అధికారులు ప్రతినిత్యం పనులను చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించారు. దీంతో పాటు 59 జీవోకు సంబంధించి జిల్లాలో 28, 280 దరఖాస్తులు వచ్చాయని అందుకు సంబంధించి జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించడం జరుగుతోందని ఈ ప్రక్రియను డిసెంబరు 10వ తేదీ వరకు పూర్తి చేసి పూర్తి వివరాలను ప్రభుత్వానికి సమర్పిస్తామని కలెక్టర్ హరీశ్ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు అన్ని పనులు చేపడుతున్నామని అభివృద్ధి చేపడుతున్నామని కలెక్టర్ హరీశ్ తెలిపారు.. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణ పురోగతిపై నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాకు మంజూరు చేసిన ఇండ్ల సంఖ్య, టెండర్ పూర్తి అయినవి, నిర్మాణం ప్రారంభమైన ఇండ్లు, వివిధ దశలలో ఉన్న నిర్మాణ ఇండ్ల వివరాలు, అధికారుల ఎంపిక సంపూర్ణ అంశాలను పరిగణలోకి తీసుకొని నివేదిక సిద్ధం చేసి సమర్పించాలని కలెక్టర్ సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
@@@@@@@

జనవరి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేయాలి,
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌రెడ్డి,
ధరణి, 58, 59 జీవోలపై సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ,
రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి మంత్రి ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ 18 వేల 328 కోట్ల వ్యయంతో 2.91 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నిర్మించి, పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేలా వంద శాతం సబ్సిడీతో పంపీణి చేసేలా సీఎం కేసీఆర్ ప్రాజెక్టు  రూపొందించారని దీనిని విజయవంతం చేయాలని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధి మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా 62 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తయ్యాయని, 40 వేల ఇండ్లు నిర్మాణం తుది దశలో ఉన్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా  33 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి 26 వేల ఇండ్లను అందజేశామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించారు.  ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో మార్గదర్శకాల ప్రకారం జిల్లా కలెక్టర్లు వారి పరిధిలో నిర్మాణం పూర్తయిన, తుది దశలో ఉన్న ఇళ్ళకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని మంత్రి సూచించారు.  డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించిన గ్రామాలు, పట్టణ పరిధిలో అధిక సంఖ్యలో అర్హులైన లబ్దిదారులకు ఉన్న నేపథ్యంలో లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఎంపిక చేయాలని, మిగిలిన అర్హులు వివరాలతో వెయిటింగ్ లిస్టు జాబితా తయారు చేయాలని మంత్రి వివరించారు. ఈ మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ  లబ్ధిదారుల ఎంపిక, పూర్తయిన ఇళ్ళ పంపిణీ క్షేత్రస్థాయిలో సమాంతరంగా జరగాలని మంత్రి కలెక్టర్లు, అధికారులకు ఆదేశించారు.  రెండు పడక గదుల ఇళ్ళ పంపిణీ పూర్తయిన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేయాలని ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు.  రాష్ట్ర వ్యాప్తంగా 283 కాలనీలో 18 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, సంబంధించిన ఎమ్మెల్యేలతో  సమన్వయం చేసుకుంటూ త్వరగా పంపిణీ చేయాలని కలెక్టర్లకు మంత్రి వివరించారు. ఈ విషయంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు  త్రాగునీటి సరఫరా,  డ్రైనేజీ, విద్యుత్ కనెక్షన్ వంటి మౌళిక వసతుల కల్పనకు రూ.205 కోట్లు మంజూరు చేశామని, నిధులను వినియోగించుకుంటూ మౌళిక వసతుల కల్పన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. 18 వేల కోట్ల ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు 11,990  కోట్ల రూపాయల బిల్లులు చెల్లించామని, నిధులకు ఎలాంటి కొరత లేదని, రాష్ట్ర వ్యాప్తంగా తుది దశ నిర్మాణంలో ఉన్న 40 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వేగవంతంగా పూర్తి జరిగేలా కలెక్టర్లు పర్యవేక్షించాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ విషక్ష్మీంలో ఇళ్ళ నిర్మాణ పురోగతిని కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ వేగం పెంచాలని, ప్రతి మాసం పురోగతి పై రివ్యూ నిర్వహిస్తామని దీనిని దృష్టిలో ఉంచుకొని  జనవరి 15 వ తేదీ వరకు  సంపూర్ణ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి వివరించారు.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ, జిఓ 58, 59, 76 ప్రకారం వచ్చిన దరఖాస్తుల స్క్రుటిని పై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి వహించాలి భూ సంబంధిత సమస్యలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడ ప్రాంగణాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సిఎస్ సోమేశ్ కుమార్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలకు జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలని సూచించారు. అలాగే జిల్లాలో ధరణి, 58, 59 జీవోపై కలెక్టర్ల ద్వారా సమాచారం తెలుసుకొన్నారు.

Share This Post