మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో దూసుకెళ్తోంది ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

 

పత్రిక ప్రకటన

తేదీ : 28–05–2022

 

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో దూసుకెళ్తోంది

ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి వాటిని విజయవంతం చేయడంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ కృషి వల్ల భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలన్నింటికీ ఆదర్శంగా నిలుస్తోందని ఇక్కడి పథకాలను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారన్నారు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీటిని సరఫరా చేస్తున్నామని ప్రజలకు వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా చేసినట్లు తెలిపారు.  జిల్లాలో ఉన్న 61 గ్రామపంచాయతీలను ఆదర్శప్రాయంగా తీర్చదిద్దాల్సిన అవసరం ఉందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య శాఖ అధికారులు బాగా పని చేస్తున్నారని ఘట్కేసర్లో ఇప్పటికే డయాలసిస్ కేంద్రం ఉండగా  ప్రజల సౌకర్యార్థం మేడ్చల్ ప్రాంతంలో  కూడా డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంబంధిత శాఖ మంత్రికి లేఖ రాశానని ఏర్పాటయ్యేలా చూస్తానని అంబులెన్స్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమావేశంలో మంత్రి  స్పష్టం చేశారు. జిల్లాలోని షామీర్పేట ఆసుపత్రిలో మార్చురి లేకపోవడం వల్ల ఈ ప్రాంతం జాతీయ రహదారిపై ఉండటం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని మార్చురీ కోసం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు వెళ్ళేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దీనిని దృష్టిలో ఉంచుకొని షామీర్పేట ప్రాంతంలో మార్చురీ ఏర్పాటు చేయాలని లేఖ రాశానని త్వరలోనే మార్చురీ ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  అలాగే ఘట్కేసర్కు వంద పడకల ఆసుపత్రి, కిడ్నీ, డయాలసిస్ ఉన్నాయని వాటిని మరింత బాగా చేయనున్నట్లు మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తారని ఆయన ప్రత్యేకంగా దృష్టిసారించి రూ.10 వేల కోట్లు కేటాయించారని మంత్రి వివరించారు. దీంతో పాటు రెండేళ్ళు కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ అందరికీ వైద్యం అందేలా చూడటం కేవలం సీఎం ఆలోచన విధానంతోనే సాధ్యమైందని అన్నారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని అల్వాల్ ప్రాంతంలో వెయ్యి కోట్ల రూపాయలతో 28 ఎకరాల విస్తీర్ణంలో  తెలంగాణ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్)ను  నిర్మించేందుకు భూమి పూజ చేయడం జరిగిందని ఇది జిల్లాకెంతో గర్వకారణమని సీఎం కృషి వల్లే ఈ ప్రాంతంలో అతిపెద్ద ఆసుపత్రి మంజూరయ్యిందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మన ఊరు – మన బడి పథకం కింద ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు రూ.7,200 కోట్లు మంజూరు చేసి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటుందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో కూడా పాఠశాలలను అభివృద్ధి చేసి అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చడం జరుగుతుందని మంత్రి సమావేశంలో వివరించారు. ధాన్యం కొనుగోలు చేసిన డెబ్బై రెండు గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయని ఇది రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో జిల్లా అధికార యంత్రాంగం అహర్నిషలు శ్రమించి ఎంతో బాగా పని చేశారని వారిని మంత్రి అభినందించారు. దేశంలో 20 ఉత్తమ గ్రామాల్లో 19 మనవే. 10 కి 10 ఆదర్శ గ్రామాలు కూడా మనవేపల్లె ప్రగతి 5వ విడత మరింత పకడ్బందీగా నిర్వహించాలి. ఈ సారి బాధ్యత అంతా ప్రజా ప్రతినిధులదే. సమన్వయం చేసే బాధ్యతను జెడ్పీ చైర్మన్ లు, సీఈఓ లు తీసుకోవాలి అని తెలిపినారు  అధికారుల ఇదే స్ఫూర్తితో మరింత అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచాలని మంత్రి మల్లారెడ్డి ఆకాక్షించారు.

అనంతరం జిల్లా పరిషత్ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం జూన్ 3వ తేదీ నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో ఉండాలన్నారు.  పల్లె ప్రగతిలో చేపట్టబోయే కార్యక్రమాల వివరాలను సంబంధిత ఎంపీడీవోలకు ముందుగానే తెలియజేయాలన్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పని చేయాలని శరత్ చంద్రారెడ్డి కోరారు. ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలిపేలా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని అందుకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో వ్యవసాయం, ఉద్యావనం, అటవీ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, ఆర్ అండ్ బీ, మిషన్ భగీరథ, ధాన్యం కొనుగోళ్ళు తదితర అంశాలపై సంబంధిత అధికారులను జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల అధికారులు సమాధానాలివ్వడంతో పాటు అందుకు సంబంధించి వివరాలను తెలిపారు. ఈ సమావేశంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, జడ్పీ సీఈవో దేవసహాయం, వైస్ జెడ్పిపి చైర్మన్,  బెస్త వెంకటేష్, ఎంపీపీలు, జడ్పీటీసీలు,కో అప్షన్ సభ్యులు,  ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post