మేడ్చల్ –- మల్కాజిగిరి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.

పత్రిక ప్రకటన

తేదీ : 17–08–2022

మేడ్చల్ –- మల్కాజిగిరి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్
కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు
జిల్లా కలెక్టర్ హరీశ్‌ను కుర్చీలో కూర్చోబెట్టిన సీఎం
అనంతరం కలెక్టరేట్లో సర్వమత ప్రార్థనలు
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా షామీర్‌పేటలో వద్ద అంతాయిపల్లిలో రూ.56.20 లక్షలతో ముప్పై ఎకరాల విస్తీర్ణంలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం 3.27 గంటలకు కార్యాలయాల సముదాయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికి బెలూన్లను వదిలారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి 3,49 గంటలకు భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం మధ్యాహ్నం జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో కలెక్టర్ హరీశ్‌ను ఆయన కుర్చీలో కూర్చోబెట్టి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో సర్వమత ప్రార్థనలు జరపగా సీఎం పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ హరీశ్ దంపతులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జ్ఞాపికను అందచేశారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్, రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, ఫ్యాక్టరీలు, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీలు) శంభీపూర్ రాజు, సురభివాణీ దేవి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, నవీన్‌కుమార్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు శ్యాంసన్, లింగ్యానాయక్, తూముకుంట మున్సిపల్ ఛైర్మన్ కారంగుల రాజేశ్వర్ రావు, షామీర్పేట ఎంపీపీ దాసరి యెల్లు బాయి, షామీర్పేట జడ్పీటీసీ సభ్యరాలు మహంకాళి అనిత, తూముకుంట మున్సిపల్ కౌన్సిలర్ సింగిరెడ్డి రజినితో పాటు ఆయా శాఖల జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post