గృహ మరియు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, న్యూఢిల్లీ భారత ప్రభుత్వం వారు మేరీ లైఫ్ మేరా స్వచ్ఛ షహర్ అనే కార్యక్రమాన్ని మే 15 నుండి జూన్ 5 వరకు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసి ఉన్నారు
మేరీ లైఫ్ కార్యక్రమంలో భాగంగానే అనేక కార్యక్రమాలను పురపాలక సంఘ పరిధిలో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ప్రతి వార్డులో RRR సెంటర్ లు ఓపెన్ చేయడం జరిగింది. ట్రిపుల్ ఆర్ సెంటర్ అనగా *రెడ్యూస్,
రియూజ్,రీసైకిల్* అంటే మనకు అనవసరమైన వస్తువులను అనగా బట్టలు చెప్పులు షూస్ ఇతర ప్లాస్టిక్ వస్తువులు ఈ ట్రిపుల్ ఆర్ సెంటర్ లకి డొనేట్ చేయడం ద్వారా మన ఇంట్లో అనవసరమైన చెత్తను రెడ్యూస్ చేసిన వాళ్ళం అవుతాము మనం ఇలా ఇచ్చిన వస్తువులను అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకెళ్లవచ్చు దీని ద్వారా వస్తువులను మళ్లీ ఉపయోగించినట్టుగా అవుతుంది లేనియెడల ఇలా సెంటర్ ల ద్వారా సేకరించిన వస్తువులను రీసైక్లింగ్ కోసం తరలించబడుతుంది. దీనిలో బాగానే నేడు మేరీ లైఫ్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలు తమ రోజువారి జీవన విధానంలో పర్యావరణహిత జీవనశల్ని అలవాట్లను అలవర్చుకొని ప్రకృతికి పర్యావరణానికి విఘాతం కలిగించకుండా రోజువారి కార్యక్రమాలు చేసుకొనడం ద్వారా రెడ్యూస్ రియూస్ రీసైకిల్ విధానాన్ని అవలంబించిన వాళ్ళం అవుతాం.. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు మేరీ లైఫ్-మేరా స్వచ్ఛ షెహర్ అనే కార్యక్రమము దోహదపడుతుందని గౌరవ చైర్పర్సన్ మరియు గౌరవ కమిషనర్ గారు మరియు ఇట్టి కార్యక్రమములో పాల్గొన్న గౌరవ కౌన్సిలర్స్ ప్రజలకు సూచించడం జరిగింది.