మే నెలాఖరులోగా మినీ స్టేడియం నిర్మాణ పనులు పూర్తి చేయాలి : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్

మే నెలాఖరులోగా మినీ స్టేడియం నిర్మాణ పనులు పూర్తి చేయాలి : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్

మే నెలాఖరులోగా మినీ స్టేడియం నిర్మాణ పనులు పూర్తి చేయాలి : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్

———————————
సిరిసిల్ల 26, ఏప్రిల్ 2022:
———————————

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ శివారులో నిర్మిస్తున్న మినీ స్టేడియంను మే నెలాఖరులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ఆదేశించారు.

3 కోట్ల రూపాయలతో, 4 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న మినీ స్టేడియం పనులను మంగళవారం ఆయన మున్సిపల్ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఆర్చ్, సీసీ రోడ్డు, వాకింగ్ ట్రాక్, లవాలీబాల్ కోర్టు, బాస్కెట్ బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టు, పార్కింగ్ స్థలంలో టైల్స్, తదితర వాటిని సమకూర్చుతున్నట్లు మున్సిపల్ అధికారులు అదనపు కలెక్టర్ కు వివరించారు. పనుల పురోగతిలో వేగం పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని, మున్సిపల్ అధికారులు ప్రతినిత్యం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

అనంతరం ఆయన కొత్తచెరువు ముందుగల డ్రైనేజీ ని పరిశీలించారు. డ్రైనేజీ మురుగును తొలగించడానికి చేపట్టాల్సిన చర్యలపై ఆరా తీశారు. కొత్త చెరువు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తదనంతరం నెహ్రూ నగర్ సమీపంలో కరకట్టను పరిశీలించారు.

ఈ సందర్శనల్లో మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య, తదితరులు ఉన్నారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, రాజన్న సిరిసిల్లచే జారీచేయనైనది.

Share This Post