ప్రచురణార్థం
మే మొదటి వారంలోగా వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ప్రారంభించాలి… జిల్లా కలెక్టర్ కె. శశాంక
మహబూబాబాద్, ఏప్రిల్ -30:
మే మొదటి వారంలోగా వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కె. శశాంక సంబంధిత అధికారులతో వేసవి క్రీడా శిక్షణా శిభిరాల ఏర్పాటుపై సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పిల్లల నుండి దరఖాస్తులు స్వీకరించి గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాల్లో వెంటనే వేసవి క్రీడా శిక్షణ శిభిరాలు ప్రారంభించాలని తెలిపారు.
డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, మహబూబాబాద్ మునిసిపల్, గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసి ఆసక్తి గల పిల్లలకు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. శిక్షణా శిబిరాలలో కూల్ వాటర్ క్యాన్ లు, ఓ.ఆర్.ఎస్.ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు సమయంలో నిర్వహించాలని తెలిపారు.
మునిసిపల్ ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని శిక్షణా కేంద్రాలను మే మొదటి వారం లోగా ప్రారంభించాలని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శిక్షణా శిబిరాల నిర్వహణా, క్రీడల పై అధికారులకు సూచనలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ సి.ఈ. ఓ. రమాదేవి, డి.అర్.డి. ఓ. సన్యాసయ్య, డి.పి. ఓ.సాయిబాబా, DYSO బి.అనిల్ కుమార్, మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మునిసిపల్ కమిషనర్ లు ప్రసన్న రాణి, జి.బాబు, సత్యనారాయణ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.