*మే 15 నాటికి మన ఊరు మన బడి కార్యక్రమ గ్రౌండింగ్ పూర్తి :: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు*

*మే 15 నాటికి మన ఊరు మన బడి కార్యక్రమ గ్రౌండింగ్ పూర్తి :: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు*

*ప్రచురణార్థం-1*

*మే 15 నాటికి మన ఊరు మన బడి కార్యక్రమ గ్రౌండింగ్ పూర్తి :: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు*

*కవర్ షెడ్డుతో డైనింగ్ హాల్ ఏర్పాటు*

*మే 10వరకు పాఠశాల పనుల ప్రతిపాదనలు పూర్తి*

*మన ఊరు మన బడి కార్యక్రమం పై విస్తృత ప్రచారం కల్పించాలి*

*పాఠశాల అభివృద్ధి పనుల్లో గ్రామస్థులు, తల్లిదండ్రుల భాగస్వామ్యం*

*ప్రతి నియోజకవర్గంలో కనీసం 2 పాఠశాలలు పనులు మే నెలలో పూర్తి*

*మన ఊరు మన బడి కార్యక్రమం అమలు పై విద్యా శాఖ మంత్రి తో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి*

జయశంకర్ భూపాలపల్లి, మే 2: జిల్లాలో మన ఊరు మన బడి మొదటి దశలో చేపట్టిన పాఠశాల పనుల గ్రౌండింగ్ మే 15 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మన ఊరు మన బడి కార్యక్రమ అమలు పై సోమవారం విద్యా శాఖ మంత్రి, సీఎస్, ఉన్నత స్థాయి అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సిద్దిపేట జిల్లాలో పనుల పురోగతి పై సమీక్ష నిర్వహిస్తే చాలా వరకు అనవసర ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు గమనించామని, దీని నివారించేందుకు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, మరో 2 జిల్లా ఉన్నతాధికారులు బృందంగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు జారీ చేయాలని మంత్రి సూచించారు. ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు.
పాఠశాలలో చేపట్టాల్సిన డైనింగ్ హాల్ పనులకు కవర్ షెడ్డు తో ఏర్పాటు చేసెందుకు రూపోందించిన డిజైన్ వినియోగించాలని మంత్రి ఆదేశించారు. పాఠశాలలకు సెలవులు ఉన్న నేపథ్యంలో పనులు త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం పనులకు శంకుస్థాపన చేసే సమయంలో గ్రామస్తులను, విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయాలని, ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరిగే అంశంపై వారికి వివరించాలని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను 2 భాషల్లో అందజేస్తామని తెలిపారు. జిల్లాలో చేపడుతున్న పాఠశాల అభివృద్ధి పనుల ఫోటోలను నాడు-నేడు పేరుతో సామాజిక మాధ్యమాల్లో, న్యూస్ పేపర్లలో జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, మన ఊరు మన బడి కింద ఎంపికైన పాఠశాలల్లో చిన్న పనులను మే మాసం చివరి వరకు పూర్తి చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించిందని మంత్రి తెలిపారు. జిల్లాలో 30 లక్షల కంటే తక్కువ ప్రతిపాదనలు ఉన్న పాఠశాల పనులు వెంటనే పాఠశాల నిర్వహణ కమిటీతో గ్రౌండ్ చేయించాలని మంత్రి ఆదేశించారు. మన ఊరు మన బడి కింద పాఠశాలలో ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డ్, పెయింటింగ్ డిజిటల్ క్లాస్ రూమ్ పనులు రాష్ట్రస్థాయిలో చేపడతామని, మిగిలిన అంశాలు జిల్లా స్థాయిలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇంటర్, 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, ప్రశ్నాపత్రాల లీకేజీ వంటివి జరగకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ, 9123 పాఠశాలలో మొదటి విడత మన ఊరు మనబడి కార్యక్రమం చేపట్టామని, 4900 పాఠశాలలో పనుల అనుమతులు మంజూరు చేసామని తెలిపారు. మెదక్, సిద్దిపేట, నారాయణపేట, నిజామాబాద్, ఆసిఫాబాద్, మేడ్చల్ , నాగర్ కర్నూల్ జిల్లాలో పాఠశాలలో పనులు పరిపాలన అనుమతులు అధికంగా పెండింగ్ ఉన్నాయని , త్వరగా పూర్తిచేయాలని సీఎస్ ఆదేశించారు. మే 10 నాటికి ప్రతి పాఠశాల ప్రతిపాదనలు తయారు చేసి, పరిపాలన అనుమతుల జారీ పూర్తి చేయాలని సీఎస్ కలెక్టర్ లను ఆదేశించారు. మన ఊరు మన బడి కార్యక్రమం కింద అనవసరపు ఖర్చులను నివారించేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని, 30 లక్షల లోపు ఉన్న పాఠశాల పనులను మే 15 నాటికి గ్రౌండ్ చేయాలని సీఎస్ ఆదేశించారు. రూ. 30 లక్షల కంటే అధికంగా ఉన్న పాఠశాల పనులకు షార్ట్ టెండర్లు పిలిచి పనులు మే చివరి నాటికి గ్రౌండ్ చేయాలని సూచించారు. జిల్లాలో అధిక ఖర్చుతో రూపోందించిన ప్రతిపాదనలు కలెక్టర్ మరోసారి పర్యవేక్షించాలని సీఎస్ ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి కార్యాలయంచే జారీ చేయనైనది.

Share This Post