మే 23 నుండి జూన్-01 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహణ …. జిల్లా కలెక్టర్ కె.శశాంక.

ప్రచురణార్ధం

మే 23 నుండి జూన్-01 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహణ …. జిల్లా కలెక్టర్ కె.శశాంక.

మహబూబాబాద్, ఏప్రిల్-21:

మే 23 నుండి జూన్-01 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించుటకు 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె. శశాంక నేడోక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం 2022 మే-23 నుంచి జూన్ 01 వరకు ఉదయం 9-30 గంటల నుండి మధ్యాహ్నం 12-45 గంటల వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు, మే -23 న ప్రథమ భాష, 24న రెండవ భాష, 25న మూడవ భాష (ఇంగ్లీష్), 26న గణితం, 27న జనరల్ సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ), 28న సోషల్ స్టడీస్, 30న ఓ.ఎస్.ఎస్.సి. మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1 (సంస్కృతం, అరబిక్), 31న ఓ.ఎస్.ఎస్.సి. మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2, జూన్ ఒకటిన ఎస్సేసి వొకేషనల్ కోర్స్ ( థియరీ ) పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అన్ని సబ్జెక్టుల్లోని ఆబ్జెక్టివ్ పేపర్ (పార్ట్ – బి)కు చివరి అరగంటలో మాత్రమే సమాధానం రాయాల్సి ఉంటుందని తెలిపారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద వహించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పరిక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆప్రకటనలో అధికారులను ఆదేశించారు.

———————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post