మే, 23 నుండి జూన్ 1వ తేదీ వరకునిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను సజావుగానిర్వహించేందుకు సంబంధిత అధికారులు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ కోరారు.

మే, 23 నుండి జూన్ 1వ తేదీ వరకునిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను సజావుగానిర్వహించేందుకు సంబంధిత అధికారులు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ కోరారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని కోర్టు హాలులో సంబంధిత శాఖల అధికారులతో 10 వ తరగతి పరీక్షల ఏర్పాట్లపై డిఆర్ఓ హరిప్రియ సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా డిఆర్ఓ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల అనంతరం పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మే 23, 2022 నుండి జూన్ 1 వరకు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
సెల్ ఫోన్ లు పరీక్ష కేంద్రాలకు తీసుకురావద్దని,ముఖ్యంగా పోలీస్,ట్రాన్స్పోర్ట్,పోస్టల్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు. ఉపాధ్యాయులు, అధికారులు అందరు అందుబాటులో ఉండాలని, పరీక్షలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా, అవాంచానియా సంఘటనలు జరగకుండా పరీక్షలు సాజావుగా నిర్వహించేందుకు గాను పోలీస్ శాఖ ద్వారా పరీక్ష కేంద్రాల వద్ద పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రశ్న పత్రాల తరలింపు కొసం ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పరీక్ష సమయంలో 144 సెక్షన్ అమలు చేయాలని అలాగే పరిసర ప్రాంతంలో గల జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు. డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారులను ఫ్లైయింగ్ స్కార్డ్ గా నియమించాలని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం పరీక్షకు ముందు తరువాత అవసరసరమైన RTC బస్సులు అన్ని రూట్లలో నడిపించాలన్నారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రతి పరీక్ష కేంద్రంలో ఎఎన్ఎమ్ లను ఏర్పాటు చేసి అవసరమైన మెడికల్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అలాగే త్రాగు నీరు సదుపాయాలు కల్పించాలన్నారు. పరీక్షలు పూర్తి అయ్యేంతవరకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను సూచించారుజిల్లాలో మొత్తం 47 వేల 540 మంది రెగ్యులర్ విద్యార్థులు, 44 మంది సప్లమెంటరీ విద్యార్థులు 283 పరీక్షా కేంద్రాల్లో పరీక్షకు హాజరు అవుతున్నారని తెలిపారు. 31 పోలీసు స్టేషన్ లలో ప్రశ్న పత్రాలు భద్రపరుస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి సుశిందర్ రావు, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి వెంక్యా నాయక్, పోలీస్ శాఖ అధికారులు, జిల్లా ట్రేజరీ అధికారి, కలెక్టరేట్ కార్యాలయ తహసీల్దార్ జయశ్రీతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share This Post