మే 6 నుండి గ్రామీణ వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ప్రారంభం …. DYSO బి.అనిల్ కుమార్.

మే 6 నుండి గ్రామీణ వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ప్రారంభం …. DYSO బి.అనిల్ కుమార్.
మహబూబాబాద్, మే -02:

జిల్లా కలెక్టర్ కె. శశాంక ఆదేశాలనుసారం 14 సంవత్సరాల లోపు బాల, బాలికల కొరకు ఈ నెల 6 నుండి గ్రామీణ వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ప్రారంభిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి బి. అనిల్ కుమార్ నేడోక ప్రకటనలో తెలిపారు

జిల్లా వ్యాప్తంగా మహబూబాబాద్ మండలంలోని లక్ష్మీపురం ZPHS లో, చిన్న గూడూరు మండలంలోని జయ్యారం, దంతాలపల్లి, కేసముద్రం మండల కేంద్రాలలో, పెద్ద వంగర మండలం లోని చిట్యాల, మరిపెడ మండలం ఎల్లంపేట లో, నెల్లికుదురు, కురవి, నర్సింహులపేట మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో, తొర్రూరు మండలం పోలేపల్లి ఎం.పి.పి.ఎస్ పాఠశాలలో వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మహబూబాబాద్ మండలం విద్యార్థిని, విద్యార్ధినులు లక్ష్మీపురం ZPHS కోచ్ సెల్ నెం. (9908339955), చిన్న గూడూరు మండలంలోని జయ్యారం (6301510696), దంతాలపల్లి (8919487761), కేసముద్రం (9603897336) మండల కేంద్రాలలో, పెద్ద వంగర మండలం లోని చిట్యాల (9441613725), మరిపెడ మండలం ఎల్లంపేట లో (9666095914), నెల్లికుదురు (9949562242), కురవి (9160253548), నర్సింహులపేట మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో (9989348716), తొర్రూరు మండలం పోలేపల్లి ఎం.పి.పి.ఎస్ పాఠశాలలో(7416450294) కోచ్ నంబర్ల లో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.

కబడ్డీ, ఖో ఖో, అథ్లెటిక్స్, వాలీబాల్, తదితర క్రీడంశాలలో శిక్షణ కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణా శిబిరం ఉదయం 6 నుండి 8 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 7 వరకు నిర్వహించ నున్నట్లు, ఆసక్తిగల 14 సంవత్సరాల లోపు బాల, బాలికలు తమ మండలంలోని ఎంపిక చేసిన ZPHS., MPPS పాఠశాలల వద్ద ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరాలలో ఉన్న కోచ్ ను ఈ నెల 5 లోగా సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని బి. అనిల్ కుమార్ ఆ ప్రకటనలో తెలిపారు.

————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post