మైనారిటీల సంక్షేమ శాఖ జాతీయ నిర్మాణ అకాడమీ ద్వారా స్వయం ఉపాధి టైలరింగ్ లో శిక్షణ పొందిన మైనారిటీ విద్యార్థులకు కుట్టు మిషన్ మరియు ధృవీకరణ పత్రాలను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు

మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందనే మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు

మంగళవారం మెదక్ జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ జాతీయ నిర్మాణ అకాడమీ ద్వారా స్వయం ఉపాధి టైలరింగ్ లో శిక్షణ పొందిన మైనారిటీ విద్యార్థులకు కుట్టు మిషన్ మరియు ధృవీకరణ పత్రాలను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు పంపిణి చేశారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి గారు మాట్లాడుతూ ఇంట్లోనే మహిళలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు న్యాక్ ద్వారా మహిళలకు మూడు నెలలు శిక్షణ ఇవ్వడం జరిగిందని వారిలో 80 శాతం హాజరు శాతం ఉన్న 19 మంది మహిళలకు కుట్టు మిషన్ మరియు ధ్రువీకరణ పత్రాలను అందజేయడం జరిగిందన్నారు మిగతా వారికి కూడా మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా రాబోయే కాలంలో కుట్టుమిషన్లు అందజేస్తామన్నారు
ఇంట్లోనే ఉంటూ కుట్టు మిషన్ ద్వారా మహిళలు ఆదాయం ఆర్జించే విధంగా చేపట్టడం జరిగిందన్నారు దీంతో ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా జెడ్పి వైస్ చైర్ పర్సన్ యం.లావణ్య రెడ్డి, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి.జగదీష్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు వసంత్ రాజ్, బీమారి. కిషోర్,ఆర్ కే శ్రీనివాస్,నర్వ. లక్ష్మీనారాయణ గౌడ్, తెరాస నాయకులు శివరామకృష్ణ, శంకర్,మేడి మధుసూదన్, శ్రీధర్ యాదవ్ మధు, మోచి. కిషన్, ముజీబ్,ఉమర్, అమీర్, తదితరులు పాల్గొన్నారు

Share This Post