*మైనారిటీ లతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వం…* *పేద ముస్లీంలకు దుస్తులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

*మైనారిటీ లతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వం…*  *పేద ముస్లీంలకు దుస్తులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

ప్రచురణార్థం

*మైనారిటీ లతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వం…*

*పేద ముస్లీంలకు దుస్తులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్*

మహబూబాబాద్, ఏప్రిల్, 25:

మైనారిటీల తో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచన చేసి వారి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు.

జిల్లాలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కింద రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపబడిన దుస్తుల గిఫ్ట్ ప్యాకెట్లను సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ముస్లిములకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత నిచ్చి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వారి ఉన్నతికి అమలు చేస్తున్నదని, నిరుపేద ముస్లిములు క్రొత్త బట్టలు కట్టుకొని రంజాన్ పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి దుస్తులను పంపడం జరిగిందని తెలిపారు. మన గురుంచి, పేదవారి సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి కె.సి.ఆర్ అని, నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లి కి షాదిముబారక్, మైనారిటీ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, విదేశాలలో చదువు నిమిత్తం వెళుతున్న వారికి 20 లక్షలు, అన్నం పెట్టే రైతన్న గురించి, 24 గంటలు విద్యుత్, రైతు బంధు, రైతు భీమా ఇలా నిరంతరం నిరుపేదల గురించి ఆలోచన చేయడం గతంలో ఏ ప్రభుత్వం లో జరుగలేదని తెలిపారు.

గతంలో మహబూబాబాద్ ఎలా ఉన్నది, ప్రస్తుతం ఎలా వున్నది పరిశీలన చేసుకోవాలని, అభివృద్ధిని గుర్తించాలని, జిల్లాకు క్రొత్తగా మెడికల్ కళాశాల రావడం, ఇతర అభివృధి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ముస్లిం జనాభా వివరాలు మైనారిటీ అధికారి అందించాలని, జనాభా ప్రకారం భవిష్యత్తులో వారందరికీ రంజాన్ తోఫా అందే విధంగా ముఖ్యమంత్రి తో మాట్లాడి జిల్లాకు తెప్పిస్తానని తెలిపారు.

మహబూబాబాద్ ఆర్డీవో కొమురయ్య, తహశీల్దార్ నాగభవాని మాట్లాడుతూ, మహబూబాబాద్ నియోజకవర్గానికి చెందిన 1500 పేద ముస్లిం కుటుంబాలకు 1500 దుస్తుల ప్యాకెట్లు రాగా మహబూబాబాద్ మండలానికి 873 కేటాయించారని, 267 రూరల్, 606 పట్టణంలో ఉన్న పేద ముస్లిములకు దుస్తుల పాకెట్ లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, ముస్లిం మైనారిటీ ప్రతినిధులు మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు, ముస్లిం మైనారిటీ ప్రతినిధులు పేద ముస్లిములకు దుస్తుల ను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ , ఆర్డీవో కొమురయ్య, మునిసిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, మునిసిపల్ వైస్ చైర్మన్ ఫరీద్, జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు పాష, మైనారిటీ వెల్ఫేర్ అధికారి బి. శ్రీనివాస రావు,

ముస్లిం, మైనార్టీ ప్రతినిధులు, ముస్లిం ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

———————————————————

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయము, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post