మైనారిటీ వర్గాలకై స్మశాన వాటికలకై స్థలాల పరిశీలించిన కలెక్టర్​ హరీశ్​

మైనారిటీ వర్గాలకై స్మశాన వాటికలకై స్థలాల పరిశీలించిన కలెక్టర్​ హరీశ్​
రాష్ట్ర మంత్రి కేటీఆర్​ ఆదేశాలతో స్థలాల పరిశీలన
రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందచేత
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ఆదేశాల మేరకు మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లాతో పాటు హైదరాబాద్​ నగర పరిసరాల ప్రాంతాల్లోని మైనారిటీలకు సంబంధించి స్మశాన వాటికల ఏర్పాటు కోసం స్థలాలను పరిశీలించామని… ఈ విషయమై రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందచేస్తామని జిల్లా కలెక్టర్​ హరీశ్​ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్​ కలెక్టర్​ శర్మన్​తో కలిసి హైదరాబాద్ నగర పరిసరాలతో పాటు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో స్మశాన వాటికలను ఏర్పాటు చేసేందుకు ఖాళీగా ఉన్న స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ హరీష్​ మాట్లాడుతూ… రాష్ట్ర పశుసంవర్ధక, సినీ ఆటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అభ్యర్థన మేరకు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో జిల్లాలోని బాల్​నగర్​ ప్రాంతంలో ఉన్న మైనార్టీలకు సంబంధించిన స్మశానవాటికలతో పాటు మరికొన్ని చోట్ల స్మశానవాటికలకు సంబంధించిన స్థలాలను పరిశీలించామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా మైనార్టీవర్గాలకు సంబంధించిన స్మశానవాటికలు కేటాయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాలతో తనతో పాటు హైదరాబాద్​ కలెక్టర్​ శర్మన్​ స్థలాలను పరిశీలించామని వివరించారు. ఈ విషయమై మరో రెండు మూడు రోజుల్లో పూర్తిగా నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందజేస్తామని కలెక్టర్ హరీశ్​ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీవో మల్లయ్య, స్థానిక తహశీల్దార్​, రెవెన్యూ, మున్సిపల్​ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Share This Post