మైనారిటీ సోదరుల అభ్యున్నతికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని స్థానిక శాసన సభ్యులు యస్ రాజేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున మైనారిటీ సోదరులకు స్థానిక జిల్లా కేంద్రం లోని మెట్రో గార్డెన్ ఫంగ్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో శాసన సభ్యులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు అల్లా ఆశీస్సులు పొందడానికి ఈ పవిత్ర రంజాన్ మాసంలో తమ వ్యాపారాలను సైతం వదిలేసి కఠోర ఉపవాసాలు ఉండి అల్లా గురించి ప్రార్థనలు చేస్తారని అన్నారు.
అనంతరం మైనారిటీ మత పెద్దలను ఖర్జురా పండు తినింపించి ఉపవాస రోజా విరమింప జేశారు.
ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ వనజ, జిల్లా అదనపు కలెక్టర్ పద్మజ రాణి , యస్పి యన్ వెంకటేశ్వర్లు, DCCB చైర్మన్ నిజంపాషా,తహసిల్దార్ దానయ్య, మున్సిపల్ చైర్పర్సన్ గండే అనసుయ్య, కన్సిలర్ అమీరోద్దిన్, తఖి చాంద్ మరియు మైనారిటీ సోదరులు పాల్గొన్నారు.