మైనారిటీ సోదరుల అభ్యున్నతికి తనవంతు పూర్తి సహకారం అందిస్తా – స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి

మైనారిటీ సోదరుల అభ్యున్నతికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు.  పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా   శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున మైనారిటీ సోదరులకు బస్ డిపో పక్కన కొత్తగా ఈద్గాకు కేటాయించిన స్థలంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో శాసన సభ్యులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు అల్లా ఆశీస్సులు పొందడానికి  ఈ పవిత్ర రంజాన్ మాసంలో   తమ వ్యాపారాలను సైతం వదిలేసి కఠోర ఉపవాసాలు ఉండి అల్లా గురించి ప్రార్థనలు చేస్తారని అన్నారు.  ఈ సందర్బంగా ఆయాన మాట్లాడుతూ తాను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతానని ఇందులో భాగంగానే కత్తిమీద ఉన్న   బాలీషాహిద్ దర్గాను ఆధునీకరణ చేయించే పనులు రేపటి నుండియే ప్రారంభమవుతాయన్నారు.  దీనికోసం రూ. 28 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు.  అదేవిధంగా ఇక్కడ మైనారిటీస్ కొరకు కేటాయించిన 3 ఎకరాల స్థలంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలో రాంజాన్ పండుగ తర్వాత కూర్చొని నిర్ణయిద్దామని తెలియజేసారు.

అనంతరం మైనారిటీ మత పెద్దలను ఖర్జురా పండు తినింపించి ఉపవాస రోజా విరమింప జేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ నాగలక్ష్మి, డి.సి.సి.బి జిల్లా కన్వీనర్ జక్కా రఘునందన్, మున్సిపల్ చైర్మన్ కల్పన, వైస్ చైర్మన్ బాబు రావు, తహసిల్దార్, ముస్లిం మత పెద్దలు షేక్ యాకుబ్, సాదిక్ పాషా, ఇసాక్,  అబ్దుల్ హాక్ మైనారిటీ సోదరులు పాల్గొన్నారు.

Share This Post