మైనార్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*మైనారిటీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం* *కృషి : జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి*

మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి అన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సిరిసిల్ల లోని గాజుల మల్లయ్య ఫంక్షన్‌ హాలులో శనివారం సాయంత్రం ప్రభుత్వం తరఫున ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఇచ్చారు.

జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ, జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే, జిల్లా అదనపు కలెక్టర్ లు శ్రీ బి సత్య ప్రసాద్ , శ్రీ ఖీమ్యా నాయక్, ఇంచార్జీ DRO, మైనారిటీ సంక్షేమ అధికారి శ్రీ టి శ్రీనివాస్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, సెస్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జిందం కళ, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయం OSD శ్రీ సర్వర్ మియా తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్, ఎస్పీ లు ముస్లిం మత పెద్దలు, ప్రతినిధుల, నాయకులతో కలిసి ఇఫ్తార్‌ అల్పాహార విందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
….

మతసామరస్యానికి ప్రతీక రంజాన్‌ అని, ఈ పవిత్ర మాసంలో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని జిల్లా కలెక్టర్‌ ఆకాంక్షించారు.

తెలంగాణలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ఉద్యోగులకు మినహాయింపులు ఇచ్చిందన్నారు. గంట ముందు .. సాయంత్రం 4 గంటలకే కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే వెసులుబాటు కలిపించిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్య అందించేందుకు
రెసిడెన్షియల్ స్కూల్ లను ఏర్పాటు చేసిందని తెలిపారు.
మైనారిటి పిల్లలను వాటిలో చేర్పించాలని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ -1 , I , III , IV మరియు పోలీస్ ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడము జరుగుతుందన్నారు . రాజన్న సిరిసిల్ల జిల్లలో ఇప్పటి వరకు ( 19 ) దరఖాస్తులు గ్రూప్- I , II , III , IV లు రావడము జరిగిందన్నారు. అలాగే ( 21 ) దరఖాస్తులు పోలీస్ రిక్రూట్మెంట్ కొరకు రావడము జరిగింది . ఇంకా ఎక్కువగ దరఖాస్తులు రావాల్సి ఉంది . కావున మైనారిటీ సోదరులు ఎక్కవ సంఖ్యా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Share This Post