మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది ఊరిఊరికో జమ్మిచెట్టు – గుడి గుడికో జమ్మిచెట్టును విజయంతం చేయాలికీసర తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ హరీశ్

మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది

ఊరిఊరికో జమ్మిచెట్టు – గుడి గుడికో జమ్మిచెట్టును విజయంతం చేయాలి

కీసర తహశీల్దార్​ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్​ హరీశ్​

మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మొక్కలను నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరంఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్​ హరీశ్​ అన్నారు.

గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ​తో పాటు రాజ్యసభ సభ్యులు సంతోష్​ కుమార్​ పిలుపు మేరకు ఊరి ఊరికో జమ్మిచెట్టు – గుడి గుడికో జమ్మిచెట్టు కార్యక్రమంలో భాగంగా  గురువారం జిల్లాలోని కీసర తహశీల్దార్​ కార్యాలయం ఆవరణలో కలెక్టర్​ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్​ హరీశ్​ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్​కుమార్​ పిలుపు మేరకు మొక్కలను నాటామని దీనివల్ల నాలుగు శాతం అటవీ విస్తీర్ణం వృద్ది చెందిందని వివరించారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలతో పాటు ఊరిలో, గుడి ఆవరణలో జమ్మి చెట్లను నాటాలని కలెక్టర్​ హరీశ్​ కోరారు.  ప్రభుత్వం ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని చేపట్టి మొక్కలు నాటేలా చూసిందని అలాగే మరింత ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటేందుకు గ్రీన్​ ఛాలెంజ్​లో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో మొక్కలను నాటాలని తెలిపారు. మొక్కలను నాటి వాటిని సంరక్షించడం వల్ల వాతావరణ కాలుష్యం అరికట్టడంతో పాటు ముందు తరాలకు మంచి వాతావరణాన్ని, భవిష్యత్తును అందించిన వారమవతామని కలెక్టర్​ హరీశ్​ అన్నారు. అనంతరం ఊరిఊరికో జమ్మిచెట్టు గుడిగుడికో జమ్మిచెట్టు పోస్టర్​ను కలెక్టర్​ హరీశ్​ తదితరులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నరసింహారెడ్డి ఆర్డిఓ రవి, కీసర తాసిల్దార్ గౌరీ వత్సల,ఎంపిడిఓ పద్మావతి , కి సర ఎంపిపి ఇందిర, అటవీశాఖ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది,  సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

Share This Post