మొక్కలను బ్రతికించాలనే చిన్నారుల తపన, ఆరాటం అధ్బుతo

మొక్కలను బ్రతికించాలనే చిన్నారుల తపన, ఆరాటం  అధ్బుతo

మొక్కలను బ్రతికించాలనే చిన్నారుల తపన, ఆరాటం నిజంగా అధ్బుతమైన ఆలోచన అని జిల్లా పంచాయతి అధికారి తరుణ్ కుమార్ అన్నారు.శుక్రవారం వెల్దుర్తి మండలం కేంద్రంలోని కోటకింద బస్తీలో పల్లె ప్రగతి క్రింద నాటిన మొక్కలను బ్రతికించాలనే
తపనతో సాద్విక్, శ్రీకాంత్, శ్రీశాంత్ అనే చిన్నారులు సైకిల్ పై నీళ్ళ డబ్బాను ఏర్పాటు చేసుకొని దానికి ఏర్పాటు చేసిన పైపు ద్వారా మొక్క, మొక్కకునీళ్లు పోస్తూ ప్రకృతి పట్ల తమకున్న మమకారాన్ని, భాద్యతను చాటారు. ఈ చిన్నారులకు వచ్చిన ఆలోచన, వన సంరక్షణ పట్ల వారికున్న అంకిత భావానికి, రేపటి భవిష్యత్తు తరాల కోసం చేసిన వాళ్ళ ప్రయత్నానికి ముగ్డులైన గ్రామ పంచాయతి కార్యదర్శి బలరాం రెడ్డి, గ్రామా పంచాయతి సభ్యులు, గ్రామస్తులు ఆ చిన్నారులను శాలువాలతో సన్మానించారని తెలిపారు.

Share This Post