మొక్కలు నాటే కార్యక్రమానికి ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవు :: జిల్లా కలెక్టర్ జి. రవి

మొక్కలు నాటే కార్యక్రమానికి ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవు :: జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకటన                                                                                                                                                                                                                                            తేదిః 14-09-2021

                                             మొక్కలు నాటే కార్యక్రమానికి ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవు :: జిల్లా కలెక్టర్ జి. రవి

      జగిత్యాల, సెప్టెంబర్ 14:  రాష్ట్రముఖ్యమంత్రి గారి అలోచనల మేరకు హరితతెలంగాణ సాధనలో బాగంగా చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమంలో నిర్లక్యంగా వ్యవహరించిన, సమస్యలను సృష్టించిన వారిపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ జి. రవి హెచ్చరించారు.  ఈ సందర్బంగా జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేట, మల్యాల మండలం రామన్నపేట, కొడిమ్యాల మండలం కొండాపూర్ గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్నీ పరిశీలించారు.   కొడిమ్యాల మండలం కొండాపూర్ గ్రామంలోని ఓడ్డెర కాలనీ వద్ద బృహాత్ పల్లెప్రకృతి వనం కొరకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించి పనులను వెంటనే ప్రారంభించాలని,  పనులకు చేపట్టడంలో కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగ, జాతీయ గ్రామీణ ఉపాధిహామి పథకం ద్వారా వెంటనే పనులను ప్రారంభించాలని, పనులకు ఎవరైన ఆటంకం కలిగించిన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కోన్నారు.  అనంతరం కొడిమ్యాల మండల కేంద్రంలోని 4వ వార్డులో సానిటేషన్ పనులను పరిశీలించి, సానిటేషన్ పనులు సక్రమంగా జరగకపోవడంపై అధికారులపై ఆగ్రహంవ్యక్తం చేశారు.   లేబర్ ద్వారా ఎప్పటికప్పుడు సానిటేషన్, పిచ్చి మొక్కలను తొలగించడం వంటి పనులను చేయించాలని, ఎవరు నివాసం లేకుండా, పిచ్చిమొక్కలతొ నిండి, కూళీ పోయోదశలో ఉన్న ఇళ్లను వెంటనే తొలగించాలని, మురుగు కాలువల నిర్వహణ సక్రమంగా ఉండాలని,  నిర్వహణ లోపించడం ద్వారా ప్రజలు వ్యాదుల బారిన పడే అవకాశం ఉన్నందున, అధికారులు 10రోజులలో పరిశుభ్రం చేయించాలని, లేదంటే కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అధికారులు గ్రామం, మండలంలో పర్యటించి సానిటేషన్ పనులను పర్యవేక్షించాలని సూచించారు. అంతకు ముందు జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేట గ్రామంలో చేపడుతున్న బృహత్ పల్లెప్రకృతి వనం కొరకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించి స్థలం సరిపోనట్లయితే అటవి, అసైన్డ్ లేదా వాడుకలో లేని స్థలాలను గుర్తించి అక్కడ పనులు చేపట్టాలని పేర్కోన్నారు.  విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున పనులను త్వరగా ప్రారంభించాలని,  ప్రకృతివనంలో ఎక్కువ అటవి మొక్కలకు ప్రాదాన్యం ఇవ్వాలని, బయోఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, ఎక్కడకూడా మొక్కల మద్య ఎక్కువ గ్యాప్ లేకుండా లక్ష్యాలను అదిగమించాలని పేర్కోన్నారు.  అనంతరం మల్యాల మండలం రామన్న పేట గ్రామశీవారులో ప్రదానరహదారి వెంట బహుళవనాల ఏర్పాటులో పోరపాట్లు లేకుండా చూడాలని, ఇచ్చిన లక్ష్యంమేర  మూడువరుసలలో మొక్కలు నాటే ప్రక్రియను పూర్తిచేసి, ట్రిగ్రార్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ పర్యటనలో స్థానికసంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి జె. ఆరుణశ్రీ, జగిత్యాల ఆర్డిఓ శ్రీమతి అర్. డి. మాదురి, పిడి డిఆర్డిఓ ఎస్. వినోద్, పత్యేక అధికారులు, యంపిడిఓలు, సర్పంచులు పాల్గోన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాలచే జారిచేయనైనది.

మొక్కలు నాటే కార్యక్రమానికి ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవు :: జిల్లా కలెక్టర్ జి. రవి

Share This Post