మొక్కలు నాటి నంరక్షించడం ద్వారా లభించే నహజ వాయువుతో మానవాళి, జీవరాశి మనుగడ సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శనివారం జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి విద్యుత్ ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన మియావాకీ ప్లాంటేషన్‌లో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సింగరేణి సంన్ధ ప్రభావిత గ్రామాల ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, భవివ్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించే దిశగా లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిన్తుందని అన్నారు. జిల్లాలోని తలసేమియా, సికిల్‌సెల్ వ్యాధిగ్రన్తుల కోసం రెడ్‌క్రాస్ సొసైటీని దత్తత తీనుకోవడం సంతోషంగా ఉందని, ఇందులో భాగంగా సుమారు 35 లక్షల రూపాయల విలువ గల అంబులెన్స్‌ను రెడ్‌క్రాస్ సొసైటీకి అందించడం జరిగిందని, రక్తనిధి కేంద్రంలో సింగరేణి సంన్ధ దాతల నుండి సేకరించిన రక్తం ద్వారా రక్త నిల్వల కొరత లేకుండా అత్యవసర సమయాలలో బాధితులకు అందించడం జరుగుతుందని తెలిపారు. సింగరేణి డైరెక్టర్ (ఫైనాన్స్, పా, ప్రాజెక్ట్, ప్లానింగ్) ఎన్.బలరాం మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉతృత్తికే కాకుండా ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని, సింగరేణి, ఎన్.టి.పి.సి. పరినర గ్రామాల ప్రజల సౌకర్యార్థం విద్య, వైద్య సేవలు అందించే దిశగా సి.ఎన్.ఆర్. నిధుల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, కరోనా సమయంలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి కార్మికులకు ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం సి.ఎన్.ఆర్. నిధుల ద్వారా కొనుగోలు చేసిన 35 లక్షల రూపాయల విలువ గల అంబులెన్స్‌ను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా టైనీ కలెక్టర్ ప్రతిభాసింగ్, సింగరేణి డైరెక్టర్ (ఈ.ఎం.) జి. నత్యనారాయణ, ఎన్.టి.పి.పి.
ఈ.డి. నంజయ్ కుమార్, జి.ఎం. పిచ్చయ్య శాస్తి, సిం.ఐ.ఎన్.ఎఫ్. కమాండెంట్ కార్తికేయన్, సిం.ఎం.ఓ.ఎ.ఐ. అధికార ప్రతినిధి సముద్రాల శ్రీనివాస్, రెడ్ క్రాస్ సొసైటీ వైస్ వైర్మన్ భాన్మర్రెడ్డి నంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.