మొక్కల సంరక్షణకు 100 మొక్కలకు ఒక సంరక్షకుడిని నియమించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ మున్సిపల్ కమిషనర్లును ఆదేశించారు.

22-11-2021

 

సోమవారం క్యాంపు కార్యాలయం నుండి హరితహారం, అవెన్యూ ప్లాంటేషన్, బృహత్ పల్లె పకృతి వనాలు ఏర్పాటు, పల్లె పకృతివనాలు ఏర్పాటు, మొక్కల సంరక్షణ చర్యలు, మొక్కలకు నీరు పోయుట, నర్సరీలు ఏర్పాటు, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారంలో మణుగూరు మున్సిపాల్టీ 100 శాతం లక్ష్యాన్ని సాధించిందని, పాల్వంచ 95 శాతం, ఇల్లందు 90 శాతం, కొత్తగూడెం 88 శాతం చేశారని, నూరుశాతం లక్ష్యాన్ని సాధించిన మణుగూరు మున్సిపల్ కమిషనర్‌ను అభినందించారు. బిపివిలో నాటిన మొక్కల యొక్క ఫోటోలను జియో ట్యాగింగ్‌తో రెండు రోజుల్లో తనకు అందచేయాలని చెప్పారు. డివైడర్లులో పిచ్చి మొక్కలు తొలగించి పరిశుభ్రం చేయాలని, డివైడర్లు ప్రక్కన ఉన్న వ్యర్ధాలను తొలగించాలని చెప్పారు. మొక్కలు పెద్దగా ఆరోగ్యంగా పెరిగేందుకు, వేళ్లు భూమిలోకి వెళ్లకుండా మరొక బ్యాగులోకి మార్చాలని చెప్పారు. అవెన్యూ ప్లాంటేషన్ లో నాటిన మొక్కలను ప్రతి రోజు వాచర్ పరిశీలన చేయాలని, రిజిష్టర్లును కమిషనర్లును పరిశీలించాలని చెప్పారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో మొక్కలను చూడగానే మీ యొక్క పనితనం కనబడాలని, మొక్కకు సపోర్టుగా ట్రీ గార్డును ఏర్పాటు చేయాలని చెప్పారు. బృహత్ పల్లె పకృతివనాల్లో ప్రజలు వాకింగ్ చేయుటకు వీలుగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని చెప్పారు. మొక్క మొక్కకు జవాబుదారీ తనం ఉండాలని, అదనపు సిబ్బందిని నియమించుకోవాలని, ప్రోసీడింగ్స్ జారీ చేయాలని చెప్పారు. మొక్కలు నాటి వాచర్‌ను ఏర్పాటు చేయకపోతే ఎలా, ఎంతో ఖర్చు పెట్టి నాటిన మొక్కలు పొడవుతాయని, మూడు రోజుల్లో వాచర్‌ను నియమించి నివేదికలు ఇవ్వాలని చెప్పారు. వాచర్ల వద్ద మొక్కల నిర్వహణపై రిజిష్టర్లు నమోదు చేయాలని, తనిఖీలో రిజిష్టర్లు చూపకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొక్కలు పెట్టేసి వదిలేశారని, ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డు కౌన్సిలర్, వార్డు ప్రత్యేక అధికారి ప్రతి రోజు మొక్కల సంరక్షణ చర్యలను పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ప్రతి వారం సమీక్ష నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణలో ఇల్లందు, పాల్వంచ, కొత్తగూడెంలకు అవార్డులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అవసరాన్ని బట్టి స్వచ్చ వాహనాలు కొనుగోలు చేయుటకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. కుక్కల వృద్ధిని అరికట్టేందేకు నిర్మించిన యానిమల్ బర్త్ కేర్ కంట్రోల్ యూనిట్ ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. వ్యర్థాలు స్వచ్ఛ ఆటోలకు మాత్రమే ఇవ్వాలనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతి వీధికి స్వచ్ఛ ఆటోలు వచ్చే సమయపాలన ఖచ్చితంగా పాటించాలని చెప్పారు. కొబ్బరికాయలు, కూరగాయల వ్యర్థాలను పిప్పి పిప్పి చేసేందుకు వాహనం కొనుగోలు చేయాలని చెప్పారు. తడి చెత్త పొడి చెత్త నిర్వహణకు ప్రజలకు అవగాహన కల్పించాలని, డస్ట్ బిన్స్ పంపిణీ చేయాలని చెప్పారు. టాక్స్ కలెక్షన్ వేగవంతం చేయాలని, నూరు శాతం లక్ష్యాన్ని సాధించాలని చెప్పారు.

 

ఈ వీడియో కాన్ఫరెన్సులో కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు మరియు మణుగూరు మున్సిపల్ కమిషనర్లు సంపత్ కుమార్, శ్రీకాంత్, అంజనకుమార్, నాగప్రసాద్, మున్సిపల్ డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post