*నిర్లక్ష్యంపై కలెక్టర్ కన్నెర్ర*
– మొక్కల సంరక్షణలో వైఫల్యం చెందిన సెక్రెటరీ నీ సస్పెండ్ చేసిన కలెక్టర్
– మరో ఇద్దరు అధికారులకు చార్జీ మెమో లు
– తాజాగా శ్రీ గాధ అంగన్వాడీ టీచర్ కు మెమో
—————————–
గంభీరావు పేట మండలం కొత్తపేట, శ్రీ గాథ గ్రామంలో DPO రవీందర్ తో కలసి ఎవెన్యూ ప్లాంటేషన్ ను జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి క్షేత్ర స్థాయిలో పరిశీలించి …
సంరక్షణలో వైఫల్యం లో చెందిన కొత్తపల్లి పంచాయతీ సెక్రటరీ A. సాయి కుమార్ ను సస్పెండ్ చేశారు.
అలాగే గంభీరావు పేట మండల పంచాయితీ అధికారి వెంకట రాజ శేఖర్ , శ్రీ గాధ పంచాయితీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ కు చార్జీ మెమో లు జారీ చేశారు.
ఎవెన్యూ ప్లాంటేషన్ ను నిన్న సందర్శించిన అనంతరం నిన్న
జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి కొత్తపెల్లి, రాజుపేట, శ్రీగాధ గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీ చేశారు.
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కల్పిస్తున్న వసతులు, సౌకర్యాల తీరును పరిశీలించారు.
ఎంతమంది చిన్నారులు, గర్భిణీలకు, బాలింతలు నమోదయ్యారనే వివరాలు కొత్తపెల్లి, రాజుపేట అంగన్వాడీ కేంద్రాల టీచర్ లను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మధ్యాహ్నం 12.40 గంటలకు శ్రీ గాధ అంగన్వాడి కేంద్రం ను సదరు అంగన్వాడీ టీచర్ టి. తెరవక పోవడం, టీచర్ విధుల్లో లేకపోవడాన్ని గుర్తించిన జిల్లా కలెక్టర్ …..
సమగ్ర విచారణ చేసి తనకు రిపోర్ట్ అందజేయాల్సిందిగా DWO ను అదేశించారు.
కేంద్రం లో రికార్డ్స్ సరిగాలేవని, ఆహార పదార్థాలు సరిగా భద్రపరచలేదని పరిసర ప్రాంతాలు శుబ్రంగా లేవని పేర్కొంటూ DWO రిపోర్ట్ అందజేశారు.
రిపోర్ట్ ఆధారంగా మెమో జారీ చేసి వివరణ అడగాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు మేరకు DWO లక్ష్మి రాజం అంగన్వాడి కేంద్రం టీచర్ కు మెమో జారీ చేశారు.
ఈ మెమో ముట్టిన 24 గంటలలో సంజాయిషి ఇవ్వగలరు లేనిచో మిమ్మల్ని విధుల నుండి తొలగించుటకు సిఫార్సు చేస్తామని DWO లక్ష్మి రాజం స్పష్టం చేశారు.
———————————————-