మొక్కల సంరక్షణ చర్యలు నిరంతర ప్రక్రియగా జరుగుతుండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ సమావేశపు హాలు నుండి డిఆర్డిఓ, డిపిఓ, జడ్పీ సిఈఓ, డివిజనల్ పంచాయతీ అధికారులు, యంపిడిఓలు, యంపిఓలు, ఏపిఓలతో పారిశుద్య కార్యక్రమాలు నిర్వహణ, కార్యదర్శుల హాజరు, సిసి చార్జీలు, రుణాలు చెల్లింపు, కోవిడ్ వాక్సినేషన్, వైకుంఠదామాలు, డంపింగ్ యార్డులు నిర్వహణ, ఇంటి పన్నులు వసూళ్లు, ఉపాధిహామి పథకం, ఇంకుడు గుంతలు, హరితహారం, బృహత్ పల్లె పకృతి వనాలు, మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ జియో ట్యాగింగ్ తదితర పల్లె ప్రగతి కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. మార్చి నెలాఖరు వరకు 50 బృహత్ పల్లె పకృతి వనాలు ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. బృహత్ పకృతివనాలు ఏర్పాటుకు నిధులు కొరకు యంపిడిఓలు డిఆర్డిఓ ద్వారా ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. మొక్కల సంరక్షణకు ప్రతి బృహత్ పల్లె పకృతి వనంలో డ్రిప్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇంటి పన్నులు వసూళ్లు 77 శాతం జరిగాయని, మిగిలిన లక్ష్యాన్ని ఫిబ్రవరి మొదటి వారం వరకు పూర్తి చేయాలని చెప్పారు. ఇంటి పన్నులు వసూళ్ల ప్రక్రియపై ప్రత్యేక చొరవ చూపాలని చెప్పారు. ఉపాధి హామి పథకం పనులు గురించి ప్రస్తావిస్తూ ఎస్టిమేషన్లు జనరేట్ చేయకుండా నివేదికలు ఇచ్చేయం నుండి వివరణ తీసుకోవాలని డిఆర్డిఓకు సూచించారు. యంపిడిఓలు ప్రతి నెలా 15 రోజులు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని, తనిఖీ వివరాలను ఆన్లైన్ యాప్లో నమోదు చేయాలని చెప్పారు. నర్సరీలలో మొక్కలు పెంపకం వివరాలను అడిగి తెలుసుకుని మొలకెత్తని విత్తనాల యొక్క నివేదికలు అందచేయాలని చెప్పారు. విత్తనాలు మంచిగా మొలకెత్తడానికి ప్రాసెస్ ప్రక్రియ పూర్తి చేసిన తదుపరి విత్తనాలు నాటాలని చెప్పారు. నర్సరీలపై పర్యవేక్షణ కొరవడిందని, విత్తనాలు మొలకెత్తే వరకు జాగ్రత్తగా కాపాడాలని చెప్పారు. ఎండలు నుండి మొక్కల రక్షణకు షేడ్ నెట్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. హరితహారంలో నాటిన మొక్కలు చనిపోయిన ప్రాంతాల్లో తిరిగి మొక్కలు నాటే ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. కోవిడ్ రెండవ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ పూర్తి చేయు విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. బూస్టర్ డోస్ ప్రక్రియ ఫ్రంట్లెన్ వర్కుర్లకు, దీర్ఘకాలిక వ్యాధులతో భాదపడేవారికి వేస్తున్నామని, లైన్ లిస్టు ఆధారంగా సత్వరమే పూర్తి చేయు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 15-17 సంవత్సరాల వయస్సు గల వారికి వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. లక్ష్మీదేవిపల్లి నుండి మున్సిపాల్టీ పరిధి వరకు అవెన్యూ ప్లాంటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని యంపిడిఓకు సూచించారు.

 

ఈ వీడియో కాన్ఫరెన్సులో డిఆర్డిఓ మధుసూదన్రాజు, జడ్పీ సిఈఓ విద్యాలత, డిపిఓ రమాకాంత్, డివిజనల్ పంచాయతీ అధికారులు కొత్తగూడెం, భద్రాచలం హరిప్రసాద్, పవన్, అన్ని మండలాల యంపిడిఓలు, యంపిఓలు, ఏపిఓలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post