*మొక్కల సంరక్షణ పకడ్బందీగా చేపట్టాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

*మొక్కల సంరక్షణ పకడ్బందీగా చేపట్టాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 11: నర్సరీ, పల్లె ప్రకృతి వనాల్లో మొక్కల సంరక్షణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. శనివారం కలెక్టర్ పాలకుర్తి మండలంలోని లక్ష్మీనారాయణపురం, తీగారం గ్రామాల్లో పర్యటించి నర్సరీలు, పల్లె ప్రకృతి వనాల ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నర్సరీల్లో డిమాండ్ మేరకు మొక్కల పెంపకం చేయాలన్నారు. నర్సరీల్లో ఏ ఏ మొక్కలు, ఎన్ని పెంచుతుంది ప్రదర్శించాలన్నారు. కలుపు ఎప్పటికప్పుడు తొలగించాలని ఆయన తెలిపారు. ప్రైమరి బెడ్లలో త్వరగా పెరిగే మొక్కలను పెంచాలన్నారు. పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు ఎప్పుడు నాటింది, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో, అవాసాల్లో పల్లె ప్రకృతి వనాల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మొక్కల పెరుగుదలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కలు దగ్గర దగ్గరగా పెరిగి ఒక వనాన్ని తలపిస్తాయన్నారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తాయని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి, డీఆర్డీఏ ఏపీడిలు నూరోద్దీన్, కొండల్ రెడ్డి, పాలకుర్తి ఎంపిడివో అశోక్ కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post