మొదటి రోజు గాంధీ సినిమా చూసిన 3462 మంది విద్యార్ధిని, విద్యార్థులు…. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మొదటి రోజు గాంధీ సినిమా చూసిన 3462 మంది విద్యార్ధిని, విద్యార్థులు…. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

మహబూబాబాద్,.ఆగస్ట్ -09:

జిల్లాలోనీ 16 మండలాల్లోనీ 3462 మంది విద్యార్థిని, విద్యార్థులు మొదటి రోజు ప్రదర్శించిన గాంధీ చిత్రాన్ని చూసారని జిల్లా కలెక్టర్ కె. శశాంక నేడొక ప్రకటనలో తెలిపారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లాలోని 10 సినిమా హాలులో మొదటి రోజు ప్రదర్శించిన గాంధీ చిత్రాన్ని 16 మండలాల ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు 3462 మంది చూసారని, చిత్ర ప్రదర్శన సకాలంలో ఉదయం 10 గంటలకు ప్రారంభించి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చేసిన ఏర్పాట్లతో తోటి విద్యార్థులతో, మిత్రులతో కలిసి వీక్షించారు అని తెలిపారు.

సినిమా నిమిత్తం పాఠశాలల వద్ద నుండి సినిమా హాలుకు, ప్రదర్శన అనంతరం సినిమా హాలు నుండి పాఠశాల వరకు విద్యార్థులను 15 మంది విద్యార్థులకు ఒక టీచర్ చొప్పున, ప్రతి బస్ కు ఒక మండల స్థాయి అధికారిని కేటాయించి పర్యవేక్షణ చేసి మొదటి రోజు మొత్తం 80 బస్సులను ఏర్పాటు చేసి తీసుకొని వెళ్లి రావడం జరిగిందని తెలిపారు.

బుధవారం, గురువారం రెండు రోజులు కూడ ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు గాంధీ మూవీ ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల అనంతరం ప్రైవేట్ పాఠశాలల వారికి చూపెట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Share This Post