మొదటి విడతగా ఎంపిక చేసిన 290 పాఠశాలల్లో మన ఊరు మన బడి కార్యక్రమం కింద అన్ని మౌళిక సదుపాయాలు పూర్తి చేసి పాఠశాల ప్రారంభమయ్యే నాటికి పిల్లలకు కొత్తగా ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునేందుకు అడుగుపెట్టేవిధంగా చర్యలు తీసుకోవాలి – రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లాలో మొదటి విడతగా ఎంపిక చేసిన 290 పాఠశాలల్లో మన ఊరు మన బడి కార్యక్రమం కింద అన్ని మౌళిక సదుపాయాలు పూర్తి చేసి పాఠశాల ప్రారంభమయ్యే నాటికి పిల్లలకు కొత్తగా ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునేందుకు  అడుగుపెట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.  శనివారం జిల్లాలో మన ఊరు మాన బడి కింద చేపడుతున్న ఆధునీకరణ పనులకు శంఖుస్థాపన లు చేసి మధ్యాహ్నం స్థానిక శుభమస్తు ఫంక్షన్ హాల్లో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలతో    సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె ఒక్కో నియోజకవర్గం ఒక్కో మండలం వారిగా ఏజెన్సీ అధికారులు ఇప్పటి వరకు చేపట్టిన పనులు పురోగతి పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.  పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి అన్ని పాఠశాలలు ఆధునీకరణ పనులు పూర్తి చేయాలని ఇందుకు ప్రతి రోజు నిర్ధారించుకున్న లక్ష్యం మేరకు పని జరిగిందా లేదా అని సమీక్ష నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ను సుచించారు.  అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని తెలిపారు.  శాసన సభ్యులు క్రమం తప్పకుండా తమ నియోజకవర్గంలో ని పాఠశాలలను సందర్శించి నాణ్యత లోపించకుండా , పనుల వేగవంతంలో ఆలస్యం కాకుండా పర్యవేక్షించాలని కోరారు. ఈ విద్యా యజ్ఞంలో ప్రతి ఒక్కరూ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.  ఒకే కాంపౌండ్ లో పాటశాల తో పాటు కళాశాల ఉంటే  కళాశాల మరమ్మతులకు సైతం ప్రతిపాదనలు అంచనాలు సిద్ధం చేయించాలని కలెక్టర్ ను సూచించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానీయ మాట్లాడుతూ తప్పనిసరి అయితే తప్ప ఉన్న కట్టడాలను కులగొట్టవద్దని వాటికీ మరమ్మతులు చేయించి ఉపయోగించుకునే విధంగా చూడాలన్నారు.  పనుల్లో నాణ్యత ఉండాలని మొత్తం పని చేసి అది వాడుకోడానికి అందుబాటులో రాకుండా ఉండేవిధంగా ఉండవద్దని  ప్రతిది పూర్తి స్థాయిలో పనులు చేయాలన్నారు.

జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వం సూచించిన మసర్గదర్శకాల మేరకు సకాలంలో పూర్తి చేసేవిధంగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు.

ఈ సమావేశంలో విద్యా శాఖ కమిషనర్ దేవసేన, పార్లమెంట్ సభ్యులు పి.రాములు, జడ్పి చైర్మన్  పి. పద్మావతి, స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్, కొల్లాపూర్ శాసన సభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ఈ.డబ్ల్యూ.డి.ఎస్ చైర్మన్ రాహుల్ శ్రీధర్ రెడ్డి, అదనపు కలెక్టర్ మను చౌదరి, ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post