మొహర్రం ఏర్పాట్లకు సంబంధించి ముందస్తు సమావేశం నిర్వహించిన మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ

కేసీఆర్ గొప్ప సెక్యులర్, తెలంగాణలో శ్రేయోరాజ్యం నడుస్తున్నది: మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ

లోటుపాట్లకు తావులేకుండా మొహర్రంకు పకడ్బంధీ ఏర్పాట్లు చేయండి:అధికారులను ఆదేశించిన మంత్రులు

మొహర్రం ఏర్పాట్లకు సంబంధించి ముందస్తు సమావేశం నిర్వహించిన మంత్రులు

సంక్షేమ భవన్ లో జరిగిన ఈ సమావేశంలో మంత్రులతో పాటు మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఇంతియాజ్,హజ్ కమిటీ ఛైర్మన్ సలీం,WAKF బోర్డు ఛైర్మన్ మసీవుల్లా, ఎమ్మెల్సీ జాఫ్రీ, ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ, ముంతాజ్ ఖాన్, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్,నగర పోలీసు కమిషనర్ ఆనంద్, జాయింట్ కమిషనర్ చౌహాన్,WAKF బోర్డు సిఇవో షానవాజ్ ఖాసీం, శంషాబాద్ డిసిపి జగదీశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప లౌకిక వాది అని, తెలంగాణ ప్రజలందరిని కంటికి రెప్పలా చూసుకుంటూ సుపరిపాలన అందిస్తున్నారని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీలు అన్నారు.వచ్చే నెల 8,9 తేదీలలో జరిగే మొహర్రం పండుగ, ఊరేగింపునకు  సంబంధించిన ఏర్పాట్లపై  ముందస్తు సమావేశం శనివారం మాసబ్ ట్యాంకులోని సంక్షేమ భవన్ లో జరిగింది.ఈ సందర్భంగా మంత్రులు కొప్పుల,అలీలు మాట్లాడుతూ, మైనారిటీలతో పాటు ప్రజలందరి భద్రత, సంక్షేమం, ఉన్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంకితభావంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రధానమైన అన్ని పండుగలు,జాతరలు,ఉత్సవాలను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో శ్రేయోరాజ్యం కొనసాగుతున్నదని,ప్రజలందరూ సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవిస్తున్నారని కొప్పుల,అలీలు వివరించారు.మొహర్రం పండుగ, ఊరేగింపు సందర్భంగా ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బంధీ ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు.అషూర్ ఖానాలకు అవసరమైన మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని,ఆ చుట్టుపక్కల చెత్తాచెదారం,గుంతలు లేకుండా చక్కగా తీర్చిదిద్దాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా, ట్రాఫిక్ జాంలకు అవకాశం ఇవ్వకుండా, తాగునీటి కొరత రాకుండా, విద్యుత్తు సరఫరాకు అంతరాయం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు,సలహాలిచ్చారు.

Share This Post