మోడల్ పాఠశాలలను ప్రారంభోత్సవానికి సన్నద్దం చేయాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

మోడల్ పాఠశాలలను ప్రారంభోత్సవానికి సన్నద్దం చేయాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం

మోడల్ పాఠశాలలను ప్రారంభోత్సవానికి సన్నద్దం చేయాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రజలందరికి కంటి పరీక్షలు నిర్వహించేందుకు పక్కా కార్యాచరణ అమలు

కమాన్ పూర్, రామగిరి మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్
————————————–
కమాన్ పూర్, రామగిరి,
పెద్దపల్లి జిల్లా, జనవరి- 31:
————————————–
కమాన్ పూర్ మండలంలోని మన ఊరు మన బడి కింద ఎంపిక చేసిన మోడల్ పాఠశాలలను ప్రారంభోత్సవానికి సన్నద్దం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం కమాన్ పూర్ మండలంలోని గుండారం, రోంపికుంట గ్రామాల్లో మన ఊరు మన బడి పనులను, రామగిరి మండలంలోని రాజపూర్ గ్రామ పంచాయతీ లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

రాజపూర్ గ్రామంలో ఉన్న 1312 మంది జనాభా కోసం జనవరి 19 నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు 5 రోజుల పాటు కంటి వెలుగు క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని, గ్రామంలో మిగిలిన ప్రజలు బుధవారం వరకు క్యాంపుకు హాజరు అయ్యేలా ప్రణాళిక తయారు చేసుకొని పకడ్బందీగా అమలు చేయాలని, ప్రజలు అధికారులు సూచించిన సమయంలో వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.

కంటి వెలుగు క్యాంపు నిర్వహణ సమయంలో అవసరమైన వారికి వెంటనే రీడింగ్ కళ్ళద్దాలు పంపిణీ చేయాలని, ప్రిస్క్రిప్షన్ కళ్లద్దాలు అవసరమైన వారి వివరాలు యాప్ లో నమోదు చేసిన 15 రోజులలో పి.హెచ్.సి కు కంపెనీ నుంచి చేరుతాయని, వాటిని త్వరితగతిన సంబంధిత లబ్దిదారులకు అందించాలని కలెక్టర్ తెలిపారు.

కంటి వెలుగు క్యాంపు నిర్వహణ సమయంలో డాటా ఎంట్రీ పకడ్బందీగా నమోదు చేయాలని, ప్రతిరోజూ అందుబాటులో ఉన్న రీడింగ్ కళ్ళద్దాలు స్టాక్ పై అంచనా వేసుకోవాలని, అవసరమైన కళ్ళద్దాల సంఖ్యను ముందుగానే తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.

అనంతరం కమాన్ పూర్ మండలంలో మోడల్ పాఠశాలలుగా ఎంపిక చేసిన గుండారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, రోంపికుంట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శించి మన ఊరు మనబడి పనులను పరిశీలించారు.

ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు మనబడి మోడల్ పాఠశాలలను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుందని, పెండింగ్ లో ఉన్న చిన్న, చిన్న పనులు పూర్తి చేయాలని, పాఠశాల సుందరీకరణ పనులు, పచ్చదనం పెరిగేలా మొక్కలు నాటడం, పాఠశాల పేరుతో బోర్డు ఏర్పాటు వంటివి పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

కమాన్ పూర్ మండలంలో ఎంపిక చేసిన మోడల్ పాఠశాలలో గ్రౌండ్ లెవెలింగ్ చేయాలని, మొక్కలు నాటి గ్రీనరీ పెంచాలని, పాఠశాలలకు మంచి లుక్ వచ్చే విధంగా తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట కమాన్ పూర్ ఎంపీడీవో విజయ్ కుమార్, తహసిల్దార్ దత్తు ప్రసాద్, మండల విద్యా శాఖ అధికారి సంపత్ రావు, ఎంపీపీలు ఆర్.లక్ష్మి , అరెళ్ళి దేవక్క కొమురయ్య గౌడ్, రామగిరి మండల ఎంపీడీవో రమేష్, డి.ఇ. విల్సన్, ఏ. ఇ. నరేష్, సర్పంచ్ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
—————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

Share This Post