మోడల్ స్కూల్ పనులు జనవరి 8 లోపు పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అధికారులను అదేశించారు

ప్రచురణార్థం …….29-12-2022

మోడల్ స్కూల్ పనులను జనవరి 8వ తేదీ కల్లా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అధికారులకు ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మండల స్పెషల్ ఆఫీసర్లు ఎంఈఓ లు, ఈఈ, డిఇ ,మోడల్ స్కూల్ హెచ్ఎం లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 56 మోడల్ స్కూల్స్ సిద్ధం చేసే బాధ్యత హెచ్ఎంలదే అని కలెక్టర్ తెలిపారు. మన ఊరు మనబడి క్రింద చేపట్టిన పనులు త్వరగా పూర్తిచేసి జనవరి 8వ తారీకు కల్లా ప్రారంభనానికి సిద్ధం చేయాలన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం క్రింద పాఠశాలలు మంజూరైన పనులు ఎందుకు పూర్తి చేయడం లేక పోతున్నామని కలెక్టర్ ప్రశ్నించారు. నిర్మాణ పనులలో అలసత్వం వహించరాదని ఈజీఎస్ క్రింద చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలి అన్నారు. మోడల్ స్కూల్ వారిగా పనులు పూర్తి చేసి ఆన్లైన్లో రికార్డు నమోదు చేయాలన్నారు. స్కూల్స్లలో ఉన్న పాత ఫర్నిచర్లను మోడల్ స్కూల్ నందు వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. మండల స్పెషల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన మోడల్ స్కూల్ లను పరిశీలించి పెండింగ్ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. మండలాల వారిగా ఎంపీడీవో, మోడల్ స్కూల్ హెచ్ఎం, ఏఈలను పనుల వివరాలను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. కొన్ని మండలాలలో ఈజీఎస్ వర్కులు ఇంకా స్టార్ట్ చేయకపోవడానికి గల కారణాలను హెచ్ఎం లను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని 56 మోడల్ స్కూల్ లను కొత్త సంవత్సరంలో ప్రారంభానికి సిద్ధం కలెక్టర్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిఇఓ అశోక్, పి ఆర్ ఈ ఈ శ్రీనివాస్ రెడ్డి, మండల ఎంఈఓ లు, మోడల్ స్కూల్ హెచ్ఎంలు, మండల స్పెషల్ ఆఫీసర్లు సిబ్బంది పాల్గొన్నారు.
—‐——————————————
జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సూర్యాపేట జిల్లా వారిచే జారీ చేయనైనది.

Share This Post